Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

నాగారంలో ఆరోగ్యవనం పార్క్ ప్రారంభం

  • ప్రారంభించిన మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి 

కీసర (ఆదాబ్ హైదరాబాద్):నాగారంలో ‘ఆరోగ్యవనం’ పార్కును తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డితో కలిసి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రజలు సేదతీరేందుకు పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కును ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణను ఆకుపచ్చని తెలంగాణగా మార్చి, మారుతున్న పరిస్థితుల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని తగ్గించి, ప్రజలకు ఆరోగ్యాన్ని పంచడమే ముఖ్య లక్ష్యంగా పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు వారి బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. నాగారంలో 40 ఎకరాల్లో ఆరోగ్య వనం పార్కును ఏర్పాటు చేశారు. పార్క్ లో వాకింగ్ పాత్, యోగా కేంద్రం, రచ్చబండ, వాటర్ ఫౌంటెన్, గేజ్‌బో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఆరోగ్య వనాన్ని వీక్షించేందుకు పెద్దలకు రోజుకు రూ.20, పిల్లలకు రూ.15 వసూలు చేయనున్నారు.ఈ కార్యక్రమం లో కలెక్టర్ యం.వి.రెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ శోభ, అటవీ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మణ్, డిప్యూటీ రేంజ్ అధికారి రవి ప్రకాష్, మాజీ జెడ్పిటిసి బండారు రమాదేవి, మాజీ ఎంపీపీ స్వప్న నాగారం మాజీ సర్పంచ్ చంద్రా రెడ్డి, దమ్మాయిగూడ మాజీ సర్పంచ్ అనురాధ యాదగిరి, , నాగారం బిజ్జ శ్రీనివాస్ గౌడ్, అటవీ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close