సినిమా వార్తలు

నానీతో శ్రీకాంత్‌ అడ్డాల?

నాని ఈ తరం హీరో అయినా క్లాసిక్‌ డేస్‌ హీరోల తరహాలో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నాడు. 2016లో కష్ణగాడి వీరప్రేమ గాథ.. జెంటిల్‌ మెన్‌.. మజ్ను.. 2017లో నేను లోకల్‌ నిన్ను కోరి ఎంసీఏ చిత్రాలతో డబుల్‌ హ్యాట్రిక్‌ ని అందుకున్నారు. గతేడాది క ష్ణార్జున్‌ యుద్ధం దేవదాస్‌ చిత్రాల్లో నటించాడు. ఇటీవల జెర్సీ లాంటి క్లాసిక్‌ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. దేవదాస్‌ తరహాలోనే ఈ సినిమాకి మంచి టాక్‌ వచ్చినా కలెక్షన్స్‌ పరంగా ఆశించిన ఫలితం దక్కలేదని ట్రేడ్‌ చెబుతోంది. కాంచన విజంభన జెర్సీకి మైనస్‌ అయ్యిందని విశ్లేషించారు. జెర్సీ తర్వాత నాని తిరిగి షూటింగ్‌ మోడ్‌ లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆన్‌ సెట్స్‌ ఉన్న సినిమాల్ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. విక్రమ్‌ కే కుమార్‌ డైరెక్షన్‌లో గ్యాంగ్‌ లీడర్‌ ఓ యూనిక్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ అని తెలుస్తోంది. దీంతోపాటు ఇంద్రగంటి మోహనకష్ణ దర్శకత్వంలో పేరుతో మల్టీస్టారర్‌ ఇటీవలే లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్‌ బాబు మరో హీరో. అతిధి రావు హైదరి నివేదా థామస్‌ హీరోయిన్లు. ఇవి రెండూ సెట్స్‌ లో ఉండగానే తాజాగా మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఫ్యామిలీ చిత్రాల కథకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ కి నాని ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ పై అల్లు అరవింద్‌ నిర్మించనున్నారు. ఈ ఏడాది సెకండాఫ్‌ లో షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని తెలుస్తుంది. శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. కొత్త బంగారు లోకం బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ గా నిలిచాయి. వరుణ్‌ తేజ్‌ తో తీసిన ముకుంద యావరేజ్‌ గా ఆడింది. అయితే చివరగా మహేష్‌ తో చేసిన బ్రహ్మూెత్సవం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమా మహేష్‌ కెరీర్‌ లో డిజాస్టర్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్‌ తర్వాత నాని రూపంలో అతడికి మరో ఛాన్స్‌ దక్కిందన్న ముచ్చట సాగుతోంది. సాఫ్ట్‌ హీరోతో సాఫ్ట్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌ ఆసక్తికరంగానే ఉంటుందనే అభిమానులు భావిస్తున్నారు. అధికారిక సమాచారం కోసం కాస్తంత వేచి చూడాల్సిందే.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close