భద్రాద్రిలో శ్రీసీతారామ కళ్యాణం

0

భారీగా ఏర్పాట్లుచేసిన ఆలయ అధికారులు

అందంగా ముస్తాబైన భద్రాచలం

భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్ర¬్మత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీసీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి మొత్తం రామనామంతో పులకించి పోయేలా ఏర్పాట్లుచేశారు. ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. కళ్యాణోత్సవానికి ఏటా వేలాదిమంది భక్తులు తరలి వస్తారు. వారికి అనుగుణంగా మిథిలా మండపంలో ఏర్పాట్లుచేశారు. స్వామివారి కల్యాణం నిర్వహించే మిథిలా ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. రామాలయంతో పాటు పరిసరాలను ముస్తాబు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకస్వాములు ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి సర్వం సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సిఎం కెసిఆర్‌ రాకపై ఇప్పటి వరకు సమాచారం లేదు. 15న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకలకు మరో మూడు రోజులు గడువు మాత్రమే ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మరో మూడురోజులు గడువు మాత్రమే మిగలడంతో తుది ఏర్పాట్లపై అధికారులు సన్నద్ధమయ్యారు. కాగా, శుక్రవారం అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, బలిహరణం, హన్మంతవాహనంపై తిరువీధిసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను దేవస్థాన ఈవో తాళ్లూరి రమేష్‌బాబు స్వయంగా పర్యవేక్షించారు. వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్ర¬్మత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం, సోమవారం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భద్రాద్రికి తరలిరానున్నారు. స్వామివారి కల్యాణం నిర్వహించే మిథిలా ప్రాంగణంలో చలువ పందిళ్లువేశారు. చలువ పందిళ్ల కింద కూలర్లు, ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల చుట్టూరా చలువ పందిళ్లను నిర్మించారు. రామాలయం విద్యుత్‌ దీపాల వెలుతురులో ధగధగ మెరుస్తున్నది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు. రెండు లక్షలకుపైగా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. దేవస్థానం ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయించింది. వివిధ ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు నేరుగా టికెట్లను విక్రయిస్తున్నది. ముత్యాల తలంబ్రాలను అందజేసేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల ద్వారా కూడా తలంబ్రాలను అందజేసేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కలెక్టర్‌ రజత్‌కుమార్‌శైనీ, భద్రాచలం సబ్‌కలెక్టర్‌ భవేష్‌మిశ్రాలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here