ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక దృష్టి

0

అభ్యర్థులను నీడలా వెన్నాడుతున్న పరిశీలకులు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గతంకన్నా భిన్నింగా ఇప్పుడు జిల్లాల్లో అధికారులు నిఘా కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఎన్‌ఇనకల ఖర్చుపై ప్రత్యేక దృష్టి సారించారు. నగదు ప్రవాహంపై ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల ప్రచారం, నగదు వ్యవహారాలపై ఎన్నికల ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఎప్పటికప్పుడు జిల్లాలకు, అక్కడి నుంచి రాష్ట్రానికి నివేదికలు వెళుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు పోటీ చేస్తున్న అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో నిత్యం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు వివరాలపై ఈసారి ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి సారించింది. విధించిన గడువుకు మించి ఖర్చు పెడితే చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల లెక్కలు తప్పుగా చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బృందాల ద్వారా ర్యాలీలు, బహిరంగ సభలతోపాటు ఇతర కార్యక్రమాలను వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు. ర్యాలీలు, సభల్లో ఎమ్మెల్యే ఫొటోలు వాడితే ఆ సభకు అయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే లెక్కిస్తారు. ప్రచారానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ఎన్నికల అధికారులు ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రత్యేక రిజిష్టర్‌ను అందజేస్తున్నారు. ఈ రిజిష్టర్‌లో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సామాన్య పౌరులు తమతో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లవద్దని, అంతకు మించి తరలిస్తే వాటిని సీజ్‌ చేసి ఆ దాయపు పన్నుల శాఖకు అప్పగించనున్నారు. నగదుకు సంబంధించిన రశీదు, ధ్రువ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. కాగా జీరో అకౌంట్స్‌ ఖాతాలతోపాటు, బ్యాంకుల లావాదేవీలపై కూడా అధికారులు కన్నేశారు. అనుమానిత వ్యక్తులపై కూడా నిఘా ఉంచేందుకు ప్రజలతో భాగ్యస్వామ్యం అవుతున్నారు. సమాచార వ్యవస్థను మరింత పెంచుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here