రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌..!

0

  • ప్రధాని నిర్ణయాలతో జిడిపి తగ్గుదల
  • న్యాయ్‌ పథకంతో 25 కోట్ల పేదలకు లబ్ది
  • చివరిదశ పంజాబ్‌లో రాహుల్‌ ప్రచారం

అమృత్‌సర్‌ :

చివరిదశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. మే 19న పంజాబ్‌లోని 13 స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘పెద్దనోట్ల రద్దు వల్ల దేశ జీడీపీ 2 శాతం తగ్గిపోతుందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంటులో చెప్పారు. ఆయన చెప్పినట్లే ఆ తదుపరి ఏడాది జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన న్యాయ్‌ పథకం కేవలం దేశంలోని 25 కోట్ల పేదలకు లబ్ది చేకూర్చడమే కాదు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు పుంజుకునేలా చేస్తుందన్నారు. దీని వల్ల దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. 2019 ఎన్నికల తర్వాత పార్లమెంటులో రెండు బ్జడెట్లు ప్రవేశపెడతాం. మొదటి బ్జడెట్‌ రైతుల కోసం, రెండో బ్జడెట్‌ జాతీయ బ్జడెట్‌. రైతులకు మా ప్రభుత్వం ఎంత సాయం చేయాలనుకుంటుదన్న విషయాన్ని పార్లమెంటులో జాతీయ బ్జడెట్‌ ప్రవేశపెట్టే ముందే చెబుతామన్నారు. కనీస మద్దతు ధర ఎంత పెంచామో చెబుతాం. ఎన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు తెరిచామో ప్రకటిస్తాం.. వీటితో పాటు మరిన్ని విషయాలు ప్రకటిస్తామని తెలిపారు. కొత్త వ్యాపారాలు స్థాపించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మేము అధికారంలోకి వచ్చాక.. మీరు చిన్న పరిశ్రమలు స్థాపించాలనుకుంటే మూడేళ్ల పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు. . నాతో చర్చించాలని ప్రధాని మోడీకి నేను సవాలు విసిరాను. నేను కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. కానీ, ఆయన మూడు గంటలు మాట్లాడుకోవచ్చు. అయినప్పటికీ ఆయన నాతో చర్చించడానికి ఒప్పుకోవట్లేదు.. ఆయన భపడుతున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మోడీ ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here