మైకులు కట్ చేయని స్పీకర్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రెండవ శాసనసభ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పరిగె శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు. స్పీకర్‌ స్థానంకు కేసీఆర్‌ సూచనలతో శ్రీనివాస్‌రెడ్డి గురువారం నామినేష న్‌ దాఖలు చేశారు. కాగా అన్ని పార్టీలు శ్రీని వాస్‌రెడ్డికి మద్దతు ఇవ్వడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ శుక్రవారం సభలో అధికారికంగా ప్రకటించారు. శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్‌గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనం తరం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్‌ చైర్‌లో కూర్చోవాలని ప్రొటెం స్పీకర్‌ కోరారు. దీంతో వెంటనే పోచారం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. పోచారంను సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లు ఆయనను స్పీకర్‌ స్థానం వరకు తీసుకుని వెళా ్లరు. ఈ సందర్భంగా స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన వారందరికి పోచారం, కేసీఆర్‌లు కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలో స్పీకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ

రెండో శాసనసభకు స్పీకర్‌ ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్క సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. శాసనసభాపతి పదవి అత్యంత కీలకమన్నారు. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, విధుల నిర్వహణలో సభాపతిగా న్యాయబద్దంగా వ్యవహరిస్తానన్నారు. సభ్యులందరి సహకారంతో సభా కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా నడుపుకోవడం మనందరి బాధ్యత అని పోచారం పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదని, ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకుందామని సభ్యులను కోరారు. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో విూరంతా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అందరం కలిసి సభను ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదామని, శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా సభ్యులందరూ వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని పోచారం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా లక్ష్మీపుత్రుడిగా బిరుదు ఇచ్చిన సీఎం కేసీఆర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాజాసింగ్‌ ప్రమాణస్వీకారం చేయకపోవడంపై స్పీకర్‌ సెక్రటరీతో ఆరా తీసుకున్నట్లు తెలుస్తుంది. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

ఊరిపేరే ఇంటి పేరుగా…

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో 1949 ఫిబ్రవరి 10న పరిగె శ్రీనివాస్‌రెడ్డి జన్మించారు. సొంత ఊరు పోచారం పేరే శ్రీనివాస్‌రెడ్డి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఇంజనీరింగ్‌ విద్యను మధ్యలోనే ఆపేసి 1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1976లో పోచారం రాజకీయాల్లో ప్రవేశించారు. 1977లో దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1987లో నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1994, 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో బాన్సువాడ నుంచి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వాలలో 1998లో గృహనిర్మాణ, 1999లో భూగర్భ గనులు, 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2018 వరకు వ్యవసాయ మంత్రిగా పని చేశారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here