రిపబ్లిక్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

    0

    న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రిపబ్లిక్‌ డే వేడుకల్లో ముఖ్య అతిథతిగా పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న రామఫోసా దంపతులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీతో భేటీ కానున్న సిరిల్‌.. భారత్‌తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు, వీసా అంశాల గురించి కూడా మాట్లాడుకోనున్నారు. 20 ఏళ్ల క్రితం రెండు దేశాల మధ్య కుదిరిన రెడ్‌ఫోర్ట్‌ డిక్లరేషన్‌ గురించి పునఃసవిూక్షించనున్నారు. ఇకపోతే గణతంత్ర దినోత్సవానికి దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని బాపూజీ ఇతివృత్తంగా వేడుకలు జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. రాజ్‌పథ్‌లో జరిగే పరేడ్‌ అందరిని ఆకట్టుకోనుంది. ఈ ఏడాది వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాపోసా హాజరుకానున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు, దేశ ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా రాజధానిలో భద్తర కట్టుదిట్టం చేశారు. అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. లజ్పత్‌ నగర్‌ లో గ్యాస్‌ పైప్‌ లైన్లను టార్గెట్‌ చేసుకుని ..ముష్కరులు దేశ రాజధానిలో విధ్వంసానికి పాల్పడే అవకాశాలున్నాయని ఐబీ హెచ్చరించింది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు.. పక్కా ప్లాన్‌ తో తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. నగరం అంతటా హై అలర్ట్‌ ప్రకటించారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here