దోబూచులాడుతున్న నైరుతి..

0

రుతుపవనాల రాకలో ఆలస్యం

  • వానలకు ఇంకా వారం ఆగాల్సిందే..!
  • సాగు ఎలా అన్న ఆందోళనలో రైతాంగం

న్యూఢిల్లీ :

ఎండలు మండుతున్నాయ్‌.. శరీరంలోని నీటినంతా ఉక్కపోత పిండేస్తోంది.. ఓ వైపు చెమటలు కక్కుతుండగానే, మరోవైపు, భానుడి భగభగలకు చర్మం కమిలిపోతోంది. అయితే, నైరుతి రుతు పవనాల పుణ్యమా అని వీటన్నింటి నుంచి ఈ నెల తొలి వారం నుంచే ఉపశమనం కలుగుతుందని ఆశించినా ఫలితం లేకపోయింది. ఎప్పుడో జూన్‌ 1నే కేరళను తాకాల్సి ఉండగా, రుతుపవనాలు 6న కేరళను తాకుతాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతన్నలు సంతోషపడ్డారు. కానీ, ఇప్పటికీ తాకలేదు. జూన్‌ 8న కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 13వ తేదీన దక్షిణ తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయట. తొలుత 11నే తెలంగాణను తాకుతాయని, జూన్‌-సెప్టెంబరు మధ్య దీర్ఘకాల సగటుతో పోలిస్తే 96శాతం సాధారణ వర్షాలు పడతాయని ఐఎండీ గతంలో అంచనా వేసింది. కానీ, రుతుపవనాలు రాక ఆలస్యం అవుతోంది. ఇంకా వానలు పడకపోవడంతో ఖరీఫ్‌ నాట్లు ఆలస్యమవుతాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతు పవనాలు నిరుడు కూడా ఆలస్యంగానే రాష్ట్రంలో ప్రవేశించాయి. రుతుపవనాలు ఆలస్యం కావడంతో దేశంలో వ్యవసాయ పనులు కూడా ఆలస్యం కానున్నాయి. రైతులు దుక్కులు దున్నుకుని సిద్దంగా ఉన్నా, చినుకు పడితే తప్ప అరక మొదలు కాదు. రుతుపవనాలు రాక, ఇంకా వానలు పడకపోవడంతో ఖరీఫ్‌ నాట్లు ఆలస్యమవుతాయని రైతాంగం ఆందోళన చెందుతోంది. నైరుతి రుతు పవనాలు నిరుడు కూడా ఆలస్యంగానే రాష్ట్రంలో ప్రవేశించాయి. ఈనెల 13న దక్షిణ తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. రెండు రోజులు అటూ ఇటూగా కూడా ఉండొచ్చని ఆయన తెలిపారు.

నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళను తాకనున్నట్లు మొదట ఐఎండీ ప్రకటించింది. అయితే, వీటి రాక ఐదు రోజులు ఆలస్యమవుతుందని ఆ మధ్య ఐఎండీ వెల్లడించింది. ఇప్పుడు మరో రెండు రోజులు ఆలస్యంగా వస్తున్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాలు జూన్‌ 8న కేరళను తాకనున్నట్లు ఐఎండీ తాజాగా తెలిపింది. ఇక 13న దక్షిణ తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వైకే రెడ్డి బుధవారం వెల్లడించారు. రెండు రోజులు అటూ ఇటూగా కూడా ఉండొచ్చని ఆయన తెలిపారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోకి ఈనెల 11న ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నిజానికి 6వ తేదీనే నైరుతి రుతుపవనాలు వస్తాయని, 11న తెలంగాణకు రావొచ్చని.. జూన్‌-సెప్టెంబరు నడుమ దీర్ఘకాల సగటుతో పోలిస్తే 96 శాతం మేర సాధారణ వర్షాలు పడతాయని ఐఎండీ కొద్దిరోజుల క్రితం అంచనా వేసింది. కానీ, అనుకున్న దానికంటే మరో రెండు ఆలస్యంగా రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. 

2018లో జూన్‌ 8న, 2017లో జూన్‌ 12న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. 2016 లో జూన్‌ 17న, 2015లో జూన్‌ 13న, 2014లో జూన్‌ 19న రుతు పవనాలు రాష్ట్రాన్ని తాకాయి. గతేడాది ఈ సీజన్‌లో 97 శాతం వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ, 92 శాతమే నమోదైంది. మరి ఈ ఏడాది ఎలా ఉంటుందనే ఆందోళన కూడా నెలకొంది. అటు, ఉష్ణోగ్రతలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినా.. మళ్లీ గణనీయంగా పెరిగాయి. బుధవారం కూడా పలుచోట్ల 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here