Featuredస్టేట్ న్యూస్

సారి… నాకు గుర్తు లేదు.. గుర్తు చేస్తే చర్యలు తీసుకుంటా

  • అక్రమాలపై ఉన్నత అధికారి స్పందించే తీరు ఇదేనా
  • నిద్రావస్తలో ఉన్న సైనిక్‌ పురి వాటర్‌ వర్క్స్‌ జీఎం

మల్కాజిగిరి (ఆదాబ్‌ హైదరాబాద్‌): మల్కాజిగిరి నియోజకవర్గంలోని మౌలాలి డివిజన్‌ పరిధిలో సాయినాథ పురం వాటర్‌ ట్యాంక్‌ పక్కనే ఉన్న సుమారు 13 అపార్ట్మెంట్‌ లకు అక్రమంగా 8అంగుళాల పైప్‌ లైన్‌ తో నీటి సర్ఫరా జరుగుతోందని స్థానిక లైన్‌ మెన్‌ ప్రతీ నెల అపార్ట్మెంట్‌ నుంచి సుమారు 5వేల రూపాయలు లంచం తీసుకుంటు ఉన్నత అధికారులకు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్క గంట వ్యవధి కూడా నీటి సర్ఫరా కస్టం అవుతున్న తరుణంలో సాయినాథపురం లోని కొన్ని అపార్ట్మెంట్‌ లకు 24గంటల నీటి సర్ఫరా అక్రమంగా జరుగుతోందని ఆదాబ్‌ హైదరాబాద్‌ కధనం ప్రచూరించింది. కధనంపై స్పందించిన జిఎం సునీల్‌ ఇది నిజమేనా అని ఆరాదీసారు. నిజం అని తేలిన తరువాత కూడా ఇప్పటివరకు సంబందిత లైన్‌ మెన్‌, మేనేజర్‌ పై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు సాగిస్తోంది. ప్రతీ అపార్ట్మెంట్‌ వద్ద నుండి అక్రమంగా వసూలు చేస్తున్న డబ్బు జిఎంకి కూడా అందడంతో…? ఈ అక్రమంపై ఎలాంటి చర్యలు చేప్పటలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధి దీనిపై జిఎం సునీల్‌ ని వివరణ కోరగా సారి నేను మర్చిపోయాను… గుర్తు చేస్తే చర్యలు తీసుకుంటా అని నిర్లక్ష్య సమాదానం చెప్పడం చూస్తూంటే స్థానికుల ఆరోపణ నిజమే నేమో అని అనిపిస్తోంది. ఒకవైపు అక్రమ కనక్షన్లపై జలమండలి కమిషనర్‌ సీరియస్‌ గా ఉన్నా కూడా ఇలాంటి బాధ్యతారాహిత్యం ఉన్న అధికారులు ఉండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అవినీతిని ప్రోత్సహిస్తున్న వాటర్‌ వర్క్‌ జిఎం తో సంస్థకి నష్టమే కానీ ఎలాంటి లాభం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిఎం కు వాహన సౌకర్యం, ఏసీ గది లాంటి ఉన్నత సౌకర్యాలు కల్పించిన సార్‌ కు మాత్రం బాధ్యతలు గుర్తు చేయాలంట. గుర్తు చేస్తే సార్‌కు నెల నెల మామూలు పోతాయని మానసిక ఆందోళన చెందుతున్నారేమో…?

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close