Featuredరాజకీయ వార్తలు

మా ఐడి కార్డును మార్ఫింగ్‌ చేశారు.

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి వ్యవహారం రాజకీయ వేడిని రాజేస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు మీ వాడంటే మీవాడంటూ రెండు పార్టీలు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. పోటాపోటీగా ఆధారాలంటూ ఫ్లెక్సీలు, ఐడీ కార్డుల్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తే అంటూ.. ఆదివారం నాడు సభ్యత్వ కార్డును తెరపైకి తెచ్చింది వైసీపీ. ఇంతకంటే ఆధారం ఏం కావాలంటూ.. టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. వైసీపీ బయటపెట్టిన శ్రీనివాసరావు సభ్యత్వ కార్డు ఫేక్‌ అంటూ టీడీపీ వారు కౌంటర్‌ ఇచ్చారు. ఏకంగా మంత్రి నారా లోకేష్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ కార్డు వెనుక మార్ఫింగ్‌ మాయ ఉందంటూ.. అసలు స్టోరీ ఇదేనంటూ ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన ట్వీట్‌లో ‘వైసీపీ ట్రేడ్‌ మార్క్‌ మార్ఫింగ్‌ ట్రిక్స్‌.. దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు ‘జగన్‌ మోదీ రెడ్డి’. తన అభిమానిని టీడీపీ కార్యకర్తగా చిత్రిస్తూ చీప్‌ ఫోటో షాప్‌ గిమ్మిక్కులా అంటూ సెటైర్‌ పేల్చారు’. మరో ట్వీట్‌లో.. ‘కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గం లోనిది అంటూ..ఫేక్‌ మెంబెర్‌ షిప్‌ కార్డ్‌ తయారు చేశారు. ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి ‘జగన్‌ మోదీ రెడ్డి’ తప్ప మరొకరు ఉండరు’అంటూ..సెటైర్‌వేశారు.

దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్‌ మోడీ రెడ్డి.తన అభిమానిని టిడిపి కార్యకర్తగా చిత్రిస్తూ చీప్‌ ఫోటో షాప్‌ జిమ్మికులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మార్ఫింగ్‌లోనూ కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గం లోనిది అంటూ ఫేక్‌ మెంబెర్‌ షిప్‌ కార్డ్‌ తయారు చేసారు.

ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్‌ మోడీ రెడ్డి తప్ప మరొకరు ఉండరు అన్నారు. ఆ కార్డులో.. పేరు జానిపల్లి శ్రీనివాసరావు.. ఊరు తానేలంక.. ముమ్మడివరం మండలం.. అమలాపురం నియోకవర్గంలో ఉందని రాసి ఉంది. వాస్తవానికి ముమ్మిడివరం మండలం.. ముమ్మిడవరం నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఇది ముమ్మాటికీ ఫేక్‌ అంటున్నారు మంత్రి. మరి లోకేష్‌ కౌంటర్‌కు వైసీపీ సమాధానం ఎలా చెబుతుందన్నది ఆసక్తిగా మారింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close