హిమాచల్‌లో హిమపాతం

0

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌ను తాజా హిమపాతం వణికిస్తోంది.మంచుతో ప్రజలునానా యాతనపడుతున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ముందుకు కదలలేని స్థితి ఏర్పడింది. కులు తదితర పర్వత ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా అధికారులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ వ్యాప్తంగా మంచు కారణంగా 413 రహదారులను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. 206 యంత్రాలతో మంచును తొలగించే పక్రియ చురుగ్గా సాగుతోంది. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌ ఉష్ణోగ్రతలు మైనస్‌ 3 డిగ్రీలకు పతనమయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇదే పరిస్థితి వచ్చే వారం కూడా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. మంచు కారణంగా 1760 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా.. 1300 ట్రాన్స్‌ఫార్మర్లను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వాటికి మరమ్మతులు చేసి త్వరలోనే పునరుద్ధరిస్తామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here