పాముతో కిచిడి

0

గర్గావన్‌ : పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే ‘మిడ్‌ డే మీల్స్‌’ నాణ్యత లోపాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, మహారా ష్ట్రలోని ఓ పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి తెలిస్తే తప్పకుండా విూ ఒళ్లు జలదరిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. నాందెడ్‌లోని గర్గావన్‌ జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం లో చనిపోయిన పాము కనిపించింది. గురువారం విద్యార్థులకు భోజనం వడ్డిస్తుండగా.. కిచిడీలో చనిపోయిన పాము ముక్కలు కనిపించాయి. దీంతో షాకైన సిబ్బంది పిల్లలను అప్రమత్తం చేశారు. కిచిడీ తినొద్దని చెప్పి.. భోజనాలు ఆపేశారు. ఈ సమాచారం అందుకున్న నాందేడ్‌ డీఈవో ప్రశాంత్‌ డిగ్రస్కార్‌ పాఠశాలకు చేరుకున్నారు. సిబ్బంది నిర్ల క్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘట నపై విచారణకు ఆదేశించారు. ఈ పాఠ శాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 80 మంది విద్యార్థులు చదువుతున్నారు. కిచిడీ లో చనిపోయిన పాము ఉన్నట్లు గుర్తిం చగానే విద్యార్థులను తినకుండా అడ్డుకు న్నామని సిబ్బంది తెలిపారు. విద్యార్థులం తా క్షేమంగా ఉన్నారన్నారు. అయితే, ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ పిల్లల ప్రాణాలకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. అయితే, నాణ్యతలేని ఆహారాన్ని విద్యార్థులకు వడ్డిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజా ఘటనతో మరోసారి లోపాలు బయటపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here