చెంప పగులకొడతానంటోంది

0

బాలీవుడ్‌ కోలీవుడ్‌ అనే తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలో కూడా ఐటెం సాంగ్స్‌ అనేవి చాలా కామన్‌ అయ్యాయి. మాస్‌ ఆడియన్స్‌ ను అలరించేందుకు ఆకట్టుకునేందుకు ఐటెం సాంగ్స్‌ ను తప్పని సరి చేశారు. చిత్రం స్థాయిని బట్టి ఐటెం సాంగ్‌ ను పెడుతున్నారు. కొన్ని సినిమాల కోసం ఐటెం సాంగ్‌ కే కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు. బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా ఐటెం సాంగ్స్‌ తో అలరించిన ముద్దుగుమ్మ మలైకా అరోరా. ఐటెం సాంగ్స్‌ కోసమే ఈమె అన్నట్లుగా ఈ అమ్మడు పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌ చేసి ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈమద్య కాలంలో ఈమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఎన్నో ఐటెం సాంగ్స్‌ చేసిన మలైకా అరోరా తాజాగా అనుపమ్‌ చోప్రా టాక్‌ షో లో పాల్గొన్న సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నేను చేసిన ప్రతి పాత్ర మరియు పాటను ఇష్టపడి చేశాను ఏ ఒక్కదాన్ని కూడా నేను బలవంతంతో చేయలేదు. నన్ను ఎవరు కూడా ఎప్పుడు ఏ పాత్ర కోసం బలవంత పెట్టలేదు. నును సినిమాలో కీలక సమయంలో వచ్చే పాటలను కొన్నింటిని చేశాను. వాటిని ప్రత్యేక పాటలు అనాలి కాని కొందరు వాటిని ఐటెం సాంగ్స్‌ అంటారు. ఆ పాటలను ఐటెం సాంగ్స్‌ అంటే నాకు అస్సలు నచ్చదు. నేను చేసిన పాటలను ఐటెం సాంగ్స్‌ అంటే నన్ను ఐటెం అంటే నేను అస్సలు ఒప్పుకోను. నా ముందుకు ఎవరైనా వచ్చి నన్ను ఐటెం అంటే మాత్రం చెంప పగులకొడతానంటోంది. ఒకప్పుడు ప్రత్యేక పాటల్లో వల్గారిటీ ఉండేది. కాని ఇప్పుడు వస్తున్న పాటల్లో మాత్రం అలా ఉండదు. గ్లామర్‌ గా ఆడియన్స్‌ కు నచ్చే విధంగా ప్రస్తుత దర్శకులు చేస్తున్నారు. వాటిని బూతు సాంగ్స్‌ అంటే ఎలా అంటూ ఈమె మీడియాను ఎదురు ప్రశ్నిస్తోంది. సినిమాల్లో అలాంటి పాటలను ఐటెం సాంగ్స్‌ అనే అంటారు ప్రత్యేక పాటలు అంటే అర్థం మారిపోతుంది. ఐటెం సాంగ్స్‌ ను ఐటెం సాంగ్స్‌ అంటే తప్పేముందో ఆమె చెప్పాలి. ఇక అర్జున్‌ కపూర్‌ తో ప్రస్తుతం ఈమె రిలేషన్‌ షిప్‌ లో ఉందనే విషయం అందరికి తెల్సిందే. అయితే తమ రిలేషన్‌ గురించి మాత్రం వారు బాహాటంగా చెప్పడం లేదు పెళ్లి అంటూ వచ్చిన పుకార్లను ఇద్దరు కూడా కొట్టి పారేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here