సిరిసిల్లలో అవినీతి కంపు…

0

శ్రీధర్‌ యాలాల సిరిసిల్ల (ఆదాబ్‌ హైదరాబాద్‌): సిరిసిల్ల జిల్లాను చేసిన అభివృద్దియే నన్ను గెలుపిస్తుంది అన్న కేటీఆర్‌కు ఇక్కడ జరిగే అవినీతి కంపు కనబడడం లేదా. సిరిసిల్ల అభివృద్ధి మేడిపండును తలపిస్తుంది. పై పై మెరుపులతో విద్యుత్‌ దీపాల హంగులతో అభివృద్ధి అనే పేరుతో వేల కోట్ల రూపాయలను దోచుకుంటూ అయినవారికి అప్పనంగా అప్పగిస్తున్నారు. నాసిరకం పనులు అధికారుల మధ్య సమన్వయలోపం నాలుగున్నరేళ్లుగా సా..గుతున్న అభివృద్ధిపై ఆదాబ్‌హైదరాబాద్‌ విశ్లేషనాత్మక కథనం. సిరిసిల్ల (ఆదాబ్‌ హైదరాబాద్‌): పార్టిలో నెంబర్‌ వన్‌ స్థానం కోసం పోటీ పడుతున్న కేటీఆర్‌ తన నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రం అట్టడుగు స్థానంలో ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆ ఐదుగురు పోషిస్తున్న అవినీతి కంపును అడ్డుకోలేని ప్రజలు ఓటు హక్కుతో ఎదురుదాడి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాలు అభివృద్ధి పనుల్లో దూసుకుపోతుండగా సిరిసిల్ల మాత్రం అందనంత దూరంగా వెనుకబడి పోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న కేటీఆర్‌ అంతర్జాతీయ వేధికలపై ప్రసంగిస్తూ ఖ్యాతి పొందుతున్న స్వంత నియోకవర్గాన్ని ఆ ఐదుగురికి వదిలేసి చోద్యం చూడడం పలు అనుమానాలకు తావిస్తుంది. మంత్రిగా నియోజకవర్గం అభివృద్ధి కోసం కేటాయిస్తున్న అవినీతి పరులకు వరంగా మారడం విశేషం. అమాత్యుని ఇలాఖాలో అవినీతి దందాను ప్రారంభించిన నేతలు చెప్పిందే వేదంగా చెలామణి అవుతుండడంతో చిత్తశుద్ధితో పని చేద్దామనుకుంటున్న అధికారులు, నేతలు సైతం నోరెళ్ల పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రిగా ముఖ్యమంత్రి తనయుడిగా పార్టీ బాధ్యతలతో కీలకపాత్ర పోషిస్తుండడంతో పార్టీ తీరికలేని కారణంగా ఆయన సృష్టించుకున్న కోటరిలో అవినీతి పరులు రాజ్యమేలుతుండడంతో కేటీఆర్‌ ప్రజల ఆధరాభిమానాలు చూరగొనడంతో విఫలమయ్యారు. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్న ముందుగా కేటీఆర్‌ భజనపరులు అందినంతా దోచుకున్న తర్వాతే మిగిలిన నిధులు దీంతో కేటాయించిన పనులకు నిధులు సరిపోక నాణ్యతలేని పనులు కొనసాగించడం అవి మూన్నాల్ల ముచ్చటగా మారడం విశేషంగా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వాలలో ఎవ్వరికీ ఇవ్వనంత స్వేచ్చను మంత్రి కేటీఆర్‌ భజన బృందానికి స్వేచ్చను ఇవ్వడంతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. దీంతో కేటీఆర్‌ ప్రజల మధ్య అబాసుపాలు అవుతున్నారు. జిల్లాలో ఏ అధికారి బదిలీలు కావాలన్నా ఈ భజన బృందం చేతులు తడపాల్సిందే. టీఆర్‌ఎస్‌ కింది స్థాయి నేతలు, కార్యకర్తలు, ఈ విషయాలపై బహిరంగంగానే విమర్శించడం ఇక్కడి అవినీతికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇటీవల సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి సూపరిండెంట్‌ డీఆర్‌, డీఏ, పీడీ పంచాయితీరాజ్‌ ఇరిగేషన్‌ ఈఈల బదిలీల వ్యవహరంపై డబ్బులు వసూళ్ల వైనాన్ని ప్రతిపక్ష నేతలు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎండగట్టిన మంత్రి కేటీఆర్‌లో ఏ మాత్రం రాకపోగా వారికి మరింత స్వేచ్ఛను ఇచ్చారని నియోకవర్గం ప్రజలు నిట్టురుస్తున్నారు. అప్పట్లో సంచలనంగా మారిగా సెస్‌ అవినీతి వ్యవహరంలో భజన బృందం పంచుకున్న అంతా ఇంతా కాదని ప్రజలు ముఖ్తకంఠంతో నిరసన వ్యక్త పరిచిన పరిస్థితులు చక్కపడలేవు. చివరకు గంభీరావుపేట మరుగుదొడ్ల బిల్లుల వ్యవహరంలో సర్పంచ్‌లు నాయకులను కాపాడేందుకు ఈ భజన బృందం మామూళ్లు తీసుకొని ఈ వ్యవహరాన్ని మరుగున పడేసింది. జిల్లాలోని సెస్‌ సంస్థలో భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బుస్స వేణు ఆరోపణలు సైతం లెక్క చేయలేదు. చిన్న బోనాల గ్రామంలో కేవలం కమిషన్ల కోసమే వేసిన రోడ్డునే మళ్లీ వేసి బిల్లులు తీసుకోవడం టీఆర్‌ఎస్‌ నాయకుల అవినీతికి పరాకాష్టం. సిరిసిల్లను అన్ని విధాలుగా అభివృద్ది చేసినా అని చెప్పుకుంటున్న కేటీఆర్‌ పైపై మెరుపులతోనే నియోజకవర్గ ప్రజలను మభ్య పెడుతున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలోని 33వ వార్డులలో డ్రైనేజీ నిర్మాణాల కోసం అక్షరాల రూ 15 కోట్లు నిధులు విడుదల చేసిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వాటికి వివరించడంలో సిరిసిల్లలో అవినీతి జడలు విప్పిన వైనం రుజువుగా మారింది. చివరకు నాలుకలు కరుచుకున్న అధికారులు అవినీతిపనులను కప్పి పుచ్చుకునేందుకు పొరపాటు జరిగిందని పత్రిక ప్రకటనలు జారీ చేశారు. గత ఏడాది మిషన్‌ భగీరథ పనుల కోసం రూ 64 కోట్ల అప్పుగా తీసుకోవాలని మున్సిపాలిటి తీర్మాణించింది. అది కూడా ఎక్కడలేని ఎక్కువ వడ్డీకి అయినా కూడా పనుల్లో వేగం నాణ్యతలోపాల్ని ప్రజలు గమనిస్తున్నారు. సిరిసిల్ల వార్డులల్లో ఆడ బిడ్డలు అవస్థలు పడుతున్నారు. వాటిని మభ్య పెట్టేందుకే యుద్ద ప్రాతిపదికన కోటి యాభై లక్షల రూపాయలతో బతుకమ్మ గాటు నిర్మించి వారి అవినీతిని కప్పిపుచ్చుకున్నారు. కేటీఆర్‌ కోటరీలో ప్రతి మండలంలో ఆ ఐదుగురు చేరి కోట్లకు పడగలేడుతున్నారు. సిరిసిల్లను తెలంగాణ ఐకాన్‌గా మారుస్తానని చెప్పుకుంటూ కేటీఆర్‌ చుట్టూ జరిగే అవినీతి కనిపించడంలేదా అని ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే సబ్సిడీ ట్రాక్టర్ల మంజూరు కోటరికి బంగారు బాతుగుడ్డులా మారింది. అయినా వారికి అప్పనంగా సబ్సిడీ ట్రాక్టర్లను కట్టబెట్టి వారి నుండి ముడుపులు తీసుకుంటున్నారు. అధికారిక వ్యవహరితో పాటు పార్టీ కార్యక్రమాలోనూ జోక్యం చేసుకొని పెత్తనం చెలాయిస్తుండడాన్ని స్వంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా కేటీఆర్‌ మారకపోతే ఓటు హక్కుతో కేటీఆర్‌కే చెక్‌ పెట్టాలని ప్రజలు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here