జెండా వేరైనా ఎజెండా ఒకటే!

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ నిరంకుశ పాలనను సాగించారని, ఆ పాలనను అంతమొందించి ప్రజాపాలనను తీసుకురావడమే తమ లక్ష్యంగా ప్రజాకూటమితో ముందుకెళ్తున్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సోమవారం ఆయన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అనేక మంది మేధావులతో తమ పార్టీ పటిష్టంగా ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదని, అది తొలిమెట్టని అన్నారు. తెలంగాణలో తాము ఆశించేది సామాజిక మార్పు అని కోదండరామ్‌ స్పష్టం చేశారు. ప్రజలకోసం పోరాడగలిగే కొత్తతరం నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థుల గెలుపుపై పూర్తి విశ్వాసం ఉందని కోదండరామ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. టీజేఎస్‌ పెట్టిన నాలుగు నెలల్లోనే సంఘాన్ని నిలబెట్టామని గర్తుచేశారు. జేఏసీ నుంచి మరికొంత బలాన్ని సవిూకరించకున్నట్టు తెలిపారు. జేఏసీగా ఉన్న రోజుల్లోనే రాజకీయ పార్టీపై సమాలోచనలు జరిపా మని అన్నారు. రాజకీయరంగం మారకుండా సమస్య లకు పరిష్కారం లభించదనే భావనతో జనసమితి అవిర్భవించిందని పేర్కొన్నారు. అనేక మంది మేధావులతో తమ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదని.. తాము ఆశిస్తున్నది సామాజిక మార్పు అని కోదండరాం వెల్లడించారు. ఎన్నికల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం అనేది భారతదేశంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి అని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం కొత్త రాజకీయ విధానాలకు రూపకల్పన చేయగలిగిన మార్పు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. అనేక విమర్శలను దృష్టిలో పెట్టుకుని పీపుల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతి ఘర్షణ నుంచి ఒక ఐకత్యను నెల రోజుల చర్చల్లో గమనించినట్టు ఆయన తెలిపారు. తాము గరికె గడ్డి లాంటి వాళ్లమని.. పీకేసిన కొద్ది మొలుస్తూనే ఉంటామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ ఎజెండా గెలిస్తే.. తాము గెలిచినట్టేనని అన్నారు. ఐకాసతో పోల్చితే తెలంగాణ జనసమితి ఏర్పాటు చేయడం కష్టంగా అనిపించలేదని కోదండరామ్‌ అన్నారు. తెజస పెట్టిన నాలుగున్నర నెలల్లోనే ప్రజల్లోకి వెళ్లిందన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఏర్పడ్డ పరిచయాలు తెజస ఏర్పాటుకు ఉపయోపడ్డాయని, పోరాట యోధులకు తెలంగాణ జనసమితి చుక్కానిగా మారిందని కోదండరాం చెప్పారు. తెజసకు అన్ని వర్గాలతో పాటు గ్రామస్థాయిలోనూ కమిటీలు ఉన్నాయని, పార్టీకి మంచి పట్టుందన్నారు. గ్రామాల్లో 40శాతం భూదస్త్రాలు ప్రక్షాళన జరగలేదని, రైతు బంధు పథకం గందరగోళంగా మారిందని విమర్శించారు.

కేసీఆర్‌కు ఏం చూసి ఓటువేయాలి?

రాజకీయం అంటే డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం అనుకుంటున్నారని ఎద్దేవాచేశారు. ప్రాజెక్టుల కవిూషన్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం రాజకీయం కాదన్నారు. ప్రజల అజెండా కోసమే తాము పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు. వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తే చాలా అనర్థాలు ఉంటాయని, నాలుగున్నరేళ్లలో కేసీఆర్‌ చేసిందేమిటి?.. ఏంచూసి ఆయనకు ఓటేయాలి? అని ప్రశ్నించారు. ప్రజాకూటమికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని, తాము అధికారంలోకి రావడం ఖాయమని కోదండరామ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తరఫున నిలబడేందుకు కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సిద్ధాంతాలు కాదు.. అజెండా నచ్చి ప్రజాకూటమితో జట్టు కట్టామన్నారు. ఉద్యమ అజెండాను అమలు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నామని చెప్పారు. కూటమి ఏర్పాటులో జాప్యం వల్ల కొంత నష్టం జరిగిందని కోదండరామ్‌ చెప్పారు. కూటమి నుంచి ఒక్కరే బరిలో ఉండేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. స్నేహపూర్వక పోటీ లేకుండా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here