Featured

సంతకం పెడితే జీతం.. పని చేస్తే లంచాలు.. జీహెచ్‌ఎంసిలో అధికారుల తీరు

ఆస్తి పన్ను ఎగ్గొట్టాలని అనుకుంటున్నారా.. ఏవి కాలేజీని సంప్రదించండి

హౖదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): ఆస్తి పన్ను ఎగవేత లోనూ గగన్‌ మహల్‌ లోని ఏవీ కాలేజీ యాజమాన్యం తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వాన్ని సైతం మోసం చేసింది.సుమారు ఏడెక రాల స్థలంలో ఏవీ కాలేజీ భవనాలతో పాటు లా కాలేజీ, ఆడిటో రియం తదితర భవనాల విస్తీర్ణాన్ని, తమ కాలేజీలకు ప్రభుత్వం గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంగా వాస్తవ పరి స్థితిని తెలిపింది. అదే సమయంలో జిహెచ్‌ఎంసి కి పన్ను చెల్లిం చే సందర్భంగా అతి తక్కువ విస్తీర్ణాన్ని చూపించి భారీ మొత్తాన్ని ఎగురవేసేందుకు అధికారులను మచ్చిక చేసుకుని విజయ వంతంగా కొన్ని సంవత్సరాల పాటు లక్షలాది రూపాయలను తమ కుటుంబ ఖజానాలో నింపుకుంది. ఏవీ కాలేజీ ఆస్తి పన్ను చెల్లింపులో అవినీతిని గుర్తించిన స్థానికులు జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏవీ కాలేజీ భవనాల విస్తీర్ణాన్ని తిరిగి లెక్కించాల్సిందిగా అధికారులు ఆదేశించారు.ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏవీ కాలేజీ భవనాల విస్తీర్ణం తిరిగి లెక్కించిన సందర్భంగా సుమారు 600 శాతం తేడాను గమనించారు. కాలేజీ చెల్లిస్తున్న ఆస్తిపన్ను పై ఫిర్యాదు చేయడానికి మునుపు 3,39,816 రూపాయలను ఆస్తి పన్ను రూపంలో సంవత్సరానికి చెల్లి ఇస్తుండగా అధికారుల రీ ఆసెస్మెంట్‌ తరువాత 18,93,632 రూపాయలను ఆస్తి పన్ను రూపంలో చెల్లించాల్సి ఉందిగా జీహెచ్‌ ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏవీ కాలేజీ యాజమాన్యం కాలేజీ భవ నాలకు దొంగ లెక్కలు చూపిన సందర్భంగా 2,24,438 రూపా యలను సంవత్సరానికి చెల్లిస్తూ ఉండగా ఉన్నతాధికారులు పర్య వేక్షణలో లెక్కలు సరి చేసి నప్పుడు 10,50,736 రూపాయలుగా పెంచబడింది. అదేవిధంగా ఏవీ లా కాలేజీ భవనానికి 1,15,378 రూపాయలు గతంలో చెల్లి స్తుండగా ప్రస్తుతం కాలేజీ భవనాలకు మొత్తం కలిపి 18,93,632 రూపాయలుగా ఆస్తిపన్ను సరి చేశారు. మొత్తం మీద అ సంవత్సరానికి సుమారు 19 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉండగా తప్పుడు లెక్కలు చూపి పన్ను ఎగవేసి నందుకుగాను సుమారు 45 లక్షల రూపాయల జరిమానాను విధించారు. అయితే తప్పుడు లెక్క ఆధారంగా సంవత్సరానికి జిహెచ్‌ఎంసి కి వచ్చే పదిహేను లక్షల రూపాయల ఆదాయాన్ని పోగొట్టేందుకు సహకరించిన అధికారు లపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విధం గా నగరంలో వేలాది భవనాల ఆస్తిపన్ను ముదింపులో అనేక అవకతవకలు జరిగాయని, అధికారుల చేతివాటం కారణంగా ఆస్తి పన్ను రూపంలో కోట్లాది రూపాయల జిహెచ్‌ఎంసి ఆదా యం కోల్పోవడం జరుగుతుంది అన్నది బహిరంగ సత్యం. ఈ కుంభకోణంలో తప్పుడు లెక్కలతో ఖజానాకు గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారు అధికారులకు కనీసం మెమో నైనా

జారీ చేయకపోవడంతో అధికారులు విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ జేబులు నింపుకో వడం సాధారణ కార్యక్రమంగా కొనసాగుతుంది. రేపటి పౌరులను జాతీయ సంపదగా తీర్చిది ద్దాల్సిన ఏవీ కాలేజీ యాజమాన్యం అడ్డదారిలో పరిగెడుతూ తప్పుల మీద తప్పులు చేస్తూ నలుగురి ముందు నగుబాటు కావడం చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వం నుండి నామ మాత్రపు ధరకు 7 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుని దాతలు సేకరించిన విరాళాలతో భవనాలను నిర్మించి పూర్తి ప్రైవేట్‌ కాలేజీగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రతి పనిలోనూ అవినీతి కట్టలను వెనకేసుకున్న యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఏవీ కాలేజీ పై చర్యలకు విద్యాశాఖ కాలేజియేట్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ దష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు.

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళా శాల యాజమాన్యం ప్రభుత్వానికి మోసం చేస్తూ ఆస్తిపన్ను ఎగవేతకు పాల్పడిన ఏవీ కాలేజీ యాజ మాన్యంపై జిహెచ్‌ఎంసి నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసు కోవాలి…తెలంగాణ విద్యార్థి పరిషత్‌ నాయకుడు నక్క శ్రీశైలం యాదవ్‌.

ఆంధ్ర విద్యాలయ కాలేజీ యజమా న్యంతో జిహెచ్‌ఎంసి అధికా రులు కుమ్మక్కై లక్షల రూపాయలు ఆస్తిపన్ను ఎగవేతకు సహకరించిన సంబంధిత జిహెచ్‌ఎంసి అధికారులపై శాఖా పర మైన చర్యలు తీసుకోవాలి… సామాజిక కార్యకర్త మహమ్మద్‌ ఫరీద్‌ ఉద్దీన్‌.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close