తిన్నది తిరిగిచ్చేయాలి

0

(పర్వీన్‌ బాను, ఆదాబ్‌ హైదరాబాద్‌)

‘ఊరు నుంచి చాలా తీసుకున్నారు. తిరిగిచ్చే యాలి. లేకుంటే లావైపోతారు.’ ఇది శ్రీమంతుడు సినిమాలోని డైలాగ్‌. అలాగే పంచాయతీలో తిన్న సొమ్ము వెనుక్కిచ్చేయాలి. లేదంటే లావెక్కరు. తిరిగి పోటీకి అనర్హులు. గ్రామాల అభివృద్ధికి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. వీటిని సరిగా ఖర్చుచేయడం సర్పంచుల బాధ్యత. అయితే కొందరు సర్పంచులు దుర్వినియోగం చేశారు. లెక్కలు కూడా లేవు. పదవీకాలం పూర్తయిన తరువాత మమ్మల్ని ఎవరూ ఏం చేయరనే ఉద్దేశంతో ఖర్చుచేసిన నిధులు చెల్లించలేకుండానే దిగిపోయారు. ఎన్నికల సంఘం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంత మేరకు నిధులు దుర్వినియోగం చేశారో వాటిని తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చింది.

ఆడిట్‌ అభ్యంతరాలు ఉన్నా… :

నిధులు దుర్వినియోగం చేసిన వారే కాకుండా, ఆడిట్‌ అభ్యంతరాలు సరిగా లేకపోవడంతో అలాంటి వారికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. లెక్కలు సరిగా లేకుండా నిధులు పక్కదారి పట్టించిన వారి వివరాలు కూడా అధికారులు తీశారు. వందల సంఖ్యలో మాజీ సర్పంచులకు చెందిన ఆడిట్‌ లో అభ్యంతరాలున్నట్లు అధికారులు జాబితా తయారుచేశారు. జమకావల్సిన నిధులు చెల్లిస్తేనే ఈ ఎన్నికల్లో వారు పోటీకి అర్హులు

జాబితాను రూపొందించిన అధికారులు

శ్రీ పంచాయతీ అధికారులు 1993 నుంచి 2011 కాలంలో నిధులు దుర్వినియోగం చేసిన మాజీ సర్పంచుల జాబితా తయారుచేశారు.

శ్రీ ఎవరెవరు నిధులు దుర్వినియోగం చేశారో వారి జాబితాను సిద్ధం చేశారు.

శ్రీ తాజా మాజీ సర్పంచుల పేర్లు కూడా అందులో ఉన్నాయి.

ఆర్‌ఆర్‌ యాక్టు ఉన్నా లాభం లేదు

శ్రీ గ్రామాల్లో నిధులు వృథాచేసిన వారిపై ఆర్‌ఆర్‌(రెవెన్యూ రికవరీ) యాక్టు విధించారు. దుర్వినియోగం

చేసిన నిధులు చెల్లించాలని ఆ యాక్టు ద్వారా మాజీ సర్పంచులకు నోటీసులు అందించారు. అయినా ఏ ఒక్కరూ కూడా చెల్లించేందుకు ముందుకు రాలేదు.

I ఆర్‌ఆర్‌ యాక్టు ద్వారా వారి ఆస్తులు కూడా జప్తు చేసే అధికారం ఉన్న సంబంధిత అధికారులు మిన్నుండిపోయారు.

ఆర్వోల వద్ద జాబితా

I అభివృద్ధి పనులు చెల్లించకుండా నిధులు పక్కదారి పట్టించిన జాబితాను గ్రామ పంచాయతీ రిటర్నింగ్‌ అధికారుల వద్ద ఉంచనున్నారు. సర్పంచి పదవికి నామినేషన్ను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అ సమయంలో నిధులు వృథాచేసిన వారు ఎవరైనా ఉంటే వారి నామినేషన్ను ఆర్వోలు తిరస్కరించనున్నారు. నిధులు చెల్లించినట్లు రషీదు తీసుకవస్తే వారి నామినేషన్‌ తీసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here