అతడి మీద ఆధార పడటం పద్ధతి కాదు.మ్యాచ్‌ ఓటమిపై కోల్‌కతా జట్టు సారథి దినేశ్‌ కార్తిక్‌

0
Bengaluru: Kolkata Knight Riders (KKR) batsman Andre Russell celebrates after beating Royal Challengers Bangalore (RCB) during the Indian Premier League 2019 (IPL T20) cricket match between Royal Challengers Bangalore (RCB) and Kolkata Knight Riders (KKR) at Chinnaswamy Stadium in Bengaluru, Friday, April 5, 2019. (PTI Photo/Shailendra Bhojak)(PTI4_5_2019_000260B)

ముంబయి: ఐపీఎల్‌ 12వ సీజన్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కథ ముగిసిన విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్‌-కోల్‌కతా జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. ప్రతి మ్యాచ్‌లో మాదిరిగానే ఈసారి కూడా ఆండ్రీరసెల్‌ ఆదుకుంటాడని భావించారంతా. ఈ ఐపీఎల్‌లో సిక్సర్ల వర్షంలో క్రికెట్‌ అభిమానులను తడిపేసిన రసెల్‌పై ఆ స్థాయి అంచనాలే నెలకొన్నాయి. కానీ తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో రసెల్‌ చేతులెత్తేశాడు. అయితే ఈ మ్యాచ్‌ ఓటమిపై కోల్‌కతా సారథి దినేశ్‌ కార్తిక్‌ మీడియాతో మాట్లాడాడు. ‘రసెల్‌ బ్యాటింగ్‌ చేయడానికి ఎంతో అవకాశం ఉంది. కానీ ప్రతి మ్యాచ్‌ను అతడే గట్టెక్కిస్తాడనుకోవడం బాగోదు. అతడి మీద ఆధార పడటం కూడా పద్ధతి కాదు. ఈ టోర్నమెంట్‌ మొత్తంలో రసెల్‌ ఆట అద్భుతం. ఈ సీజన్‌ మాకు అంత బెస్ట్‌ కాదనుకుంటా. ఐపీఎల్‌ ఒక వినోదాత్మకమైన టోర్నమెంట్‌. ప్రతిరోజు మేం మా సామర్థ్యం మేరకు పనిచేయడానికి ప్రయత్నిస్తాం. అందరి అంచనాలు అందుకోవాలంటే ముందుగా మేం కొన్నింట్లో మెరుగుపడాలి. వచ్చే ఏడాది మరింత బలంతో, ఆత్మవిశ్వాసంతో ఐపీఎల్‌లో అడుగుపెడతాం’ అని కార్తిక్‌ తెలిపాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా-ముంబయి మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here