Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

ఆమె తప్పు చేసింది.. ప్రభుత్వం కాపాడుతుంది..

40 మంది అవినీతి ఈఎస్‌ఐ ఉద్యోగులు

  • 18 లక్షల మంది కార్మికులకు శాపం
  • రూ. 466 కోట్ల మందుల కుంభకోణం
  • నివేదిక సమర్పించి పట్టించుకోని ప్రభుత్వం
  • చర్యలు తీసుకోకుండా కుంటిసాకులు
  • అవినీతి కూపంలో ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికా రాణి

ఈఎస్‌ఐ ఆస్పత్రులకు రూ.466 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లపై విజిలెన్స్‌ అండ్‌

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దర్యాప్తులో తీవ్ర అవకతవకలు పాల్పడ్డట్టు నిర్ధారించారు.2016-17

మరియు 2018-19 ఆర్థిక సంవత్సరాలకు ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందుల సరఫరా కోసం

సంస్థలకు ఇచ్చిన ఒప్పందాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ దర్యాప్తు జరిగింది. జీవో ఎంఎస్‌తో

పాటు నెంబర్‌ 51 ప్రకారము నియమ నిబంధనలు ఉల్లంఘించి స్వార్థ ప్రయోజనాల కోసం ఔషధాల

కొనుగోలు చేశారని బీమా వైద్య సేవల డైరెక్టర్‌ డాక్టర్‌ సి దేవికా రాణి మరో ఐదుగురు, డాక్టర్‌. ఎం.

వెంకటస్వామి జాయింట్‌ డైరెక్టర్‌ (ఫ్యామిలీ వెల్ఫేర్‌, డి ఐ ఎం ఎస్‌), డాక్టర్‌ ఆశ రామయ్య. ఇంచార్జ్‌

జాయింట్‌ డైరెక్టర్‌ (ఫ్యామిలీ వెల్ఫేర్‌), డాక్టర్‌ కే. వసంత ఇందిరా, కె నాగలక్ష్మి ఫార్మసిస్ట్‌ జీఆర్‌2

(డిఐఎంఎస్‌), హెచ్‌ఆర్‌. ఆరాధన దేవి ఫార్మసిస్ట్‌ జీఆర్‌2 (డిఐఎంఎస్‌) అధికారులపై క్రమశిక్షణా

చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో

సిఫారసు చేసింది. సంవత్సరం ప్రారంభంలో మందుల అవసరాన్ని విశ్లేషించడానికి ఇన్సూరెన్స్‌

మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ఏ కమిటీని ఏర్పాటు చేయలేదని దర్యాప్తులో తేలింది. ఔషధాల

కొనుగోలు కమిటీలో కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ను చేర్చలేదని రిపోర్టులో తెలిపారు.

ప్రీ-బిడ్‌ ప్రక్రియ ద్వారా బిడ్డర్లను గుర్తించడానికి స్థానిక కొనుగోలు కమిటీలు టెండర్‌ పరిశీలన

కమిటీని ఏర్పాటు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు విజిలెన్స్‌ అండ్‌

ఎన్పోర్స్‌మెంట్‌ అధికారులు గుర్తించారు. అర్హత కలిగిన సంస్థలను గుర్తించడంలో ఐ ఎం ఎస్‌ డైరెక్టర్‌,

అధికారులు విఫలమయ్యారని విజిలెన్స్‌ అధికారులు స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్‌ మెడికల్‌

సర్వీసెస్‌ అధికారులు లోపాయికారి ఒప్పందం తోనే రెండు నుండి మూడు సంస్థల నుండి కొటేషను

అంగీకరించారని, ఆ మూడు కొటేషన్లు కూడా కుటుంబంతో సంబంధం ఉన్న సంస్థలచే దాఖలు

చేయబడ్డాయి అని నివేదిక స్పష్టంగా వెల్లడించింది. చిన్న వ్యత్యాసాల తో కూడిన కొటేషన్లను

దాఖలు చేయడం జరిగిందని దర్యాప్తు అధికారులు ధృవీకరించారు.సరఫరాదారుల నమోదుకు

ప్రాథమిక కసరత్తు కూడా చేయలేదు. ఔషధాలు సరఫరా ఫోన్‌ ద్వారా ఎంపిక చేసి సంస్థలకు

సమాచారాన్ని అందించారని రిపోర్టులో వెల్లడించారు. చాలా సందర్భాలలో, మూడు కొటేషన్లు

దాఖలు చేయడం. మూడు కొటేషన్లు కూడా ఒక కుటుంబంతో సంబంధం ఉన్న సంస్థలచే దాఖలు

చేయబడ్డాయి అని నివేదిక వెల్లడించడంతో స్పష్టంగా అర్థం అవుతుంది ఐఎంఎస్‌ డైరెక్టర్‌,

అధికారులు మందులు సరఫరా చేసే సంస్థలతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఔషధాలు

కొనుగోలు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. జీవో ఎంఎస్‌ నెంబర్‌ 51 లోని నియమ నిబంధనలు

పాటించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం సంస్థకు నష్ట పరిచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం

చేశారు. అనేక సందర్భాల్లో సంస్థల నుండి అధిక ధరలకు ఔషధాలు కొనుగోలు చేసినట్టు

అధికారులు గుర్తించారు ఉదాహరణకు మానవ ఇన్సులిన్‌ ను 140 రూపాయలు చొప్పున సరఫరా

చేయడానికి డైరెక్టర్‌ దేవికారాణి యూసుఫ్‌ గూడా కు చెందిన భాస్కర్‌ ఏజెన్సీకి ఇండెంట్‌ ఇచ్చారు

ఇది రేటు కాంట్రాక్ట్‌ కంటే డెబ్బై ఎనిమిది రూపాయలు ఎక్కువ అని నివేదిక లో తేలింది. ఔషధాల

కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారు అని ఆరుగురిపై సి సి ఏ రూల్స్‌ ప్రకారము చర్యలు చేపట్టి

వలసిందిగా స్పష్టంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు ప్రభుత్వానికి దర్యాప్తు చేసి

విజిలెన్స్‌ రిపోర్ట్‌(హ = చీశీ.5, జ చీశీ .1190/హడజు/ణ 1/2018 ణa్‌వ 01-02-2019)

సమర్పించిన నేటి వరకు అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ

అవినీతి జరిగిన అనంతరం గత ఆరు నెలల నుండి బీమా చెల్లిస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో

ఔషధాలు అందడం లేదు.

ఆధారాలు ఉన్న చర్యలు తీసుకొని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ.

విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఫిబ్రవరి లో ప్రభుత్వానికి

సమర్పించిన నివేదికలో ఔషధాల కొనుగోలులో ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి మరియు మరో

ఐదుగురు సభ్యులపై సిసిఎ రూల్స్‌ ప్రకారము చర్యలు చేపట్టవలసిందిగా విజిలెన్స్‌ అండ్‌

ఎన్ఫోర్స్మెంట్‌ రిపోర్టులో సిఫార్సు చేశారు. కానీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ప్రభుత్వము నేటివరకు కూడా

సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అత్యుత్తమ దర్యాప్తు సంస్థ

విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు ఇచ్చిన వేదిక ఆధారంగా చర్యలు చేపట్టకుండా

ప్రభుత్వము కావలసి కొని ఏసీబీ ఎంక్వయిరీ అని, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ అని ఔషధాల

కొనుగోలు కుంభకోణ తీవ్రతను తగ్గించడానికి కాలయాపన చేస్తూ, చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం

చేయడానికి గల కారణాలు అర్థంకాని వ్యవహారంగా మారిందని ఈఎస్‌ఐ రోగులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డ అధికారులను ఉపేక్షించేది ఉండదని పలు సందర్భాల్లో

ప్రజలకు తెలిపారు కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు.

బీమా చెల్లిస్తున్న అందించని వైద్య సేవలు.

బీమా చెల్లిస్తున్న ప్రతి కార్మికునికి పూర్తి వైద్య చికిత్సలతో పాటు, ఔషధాలు అందించవలసిన

బాధ్యత ఐ ఎం ఎస్‌ వారిది స్వార్థ ప్రయోజనాల కోసం, దుర్బుద్ధితో అవకతవకలకు పాల్పడి గత

ఆరు నెలల నుండి ఈ ఎస్‌ ఐ హాస్పిటల్స్‌ లో కానీ, డిస్పెన్సరీ లో కానీ తీవ్రమైన జబ్బులతో

బాధపడుతున్న రోగులకు మందులు అందించకపోవడం శోచనీయం. ఇంత తీవ్రమైన సమస్య

ఉన్న కూడా పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి ఈ ఎస్‌ ఐ కార్డ్‌ పై

వారు చెల్లించిన బీమా పరంగా సంవత్సరానికి ఈ ఎస్‌ ఐ కార్పొరేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎస్‌ ఐ

కార్డు కి రూపాయలు

2,150 చెల్లిస్తుంది. ఈ సంవత్సరం నుండి ప్రతి ఈ ఎస్‌ ఐ కార్డు కి కార్పొరేషన్‌ ద్వారా మూడువేల

రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందజేస్తున్నట్లు కార్మికుల రాజ్య భీమా సంస్థ అధికారులు

తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కార్మికుల భీమ వైద్య సేవ అధికారుల సమాచారం ప్రకారం సుమారుగా

18 లక్షల ఈఎస్‌ఐ కార్డు కలిగిన వారు ఉన్నారని తెలిసింది. వారికి కేంద్ర ప్రభుత్వ కార్మిక రాజ్య

బీమా సంస్థ నుండి సుమారుగా 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి విడుదల

చేస్తుంది. మెడికల్‌ రియంబర్స్మెంట్‌ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కాకుండా ఈ నిధులను రాష్ట్ర

ప్రభుత్వానికి కార్పొరేషన్‌ చెల్లిస్తున్న ఐఎంఎస్‌ డైరెక్టరేట్‌ లోని అధికారులు అవినీతికి పాల్పడుతూ

రోగులకు మాత్రం పూర్తిస్థాయిలో వైద్య చికిత్సలు, ఔషధాలు అందించకుండా యదేచ్ఛగా అవినీతికి

పాల్పడుతున్నారని ఆధారాలతో సహా ప్రభుత్వానికి రిపోర్ట్‌ అందిన అవినీతి అధికారులకు ప్రభుత్వం

ఉపేక్షించడం ఎంతవరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

డైరెక్టర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : శశాంక్‌ గోయల్‌

ఔషధాల కొనుగోలులో భారీగా అవినీతికి పాల్పడ్డ అధికారులపై సిసిఎ రూల్స్‌ ప్రకారము చర్యలు

తీసుకోవాలని స్పష్టంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ నివేదికలో సిఫార్సు చేసినా కూడా చర్యలు

తీసుకోకపోవడానికి గల కారణాల విషయంపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కార్మిక, ఉపాధి, కర్మాగారం

ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శశాంక్‌ గోయల్‌ ఫోన్‌ లో సంప్రదించి వివరణ కోరగా విజిలెన్స్‌ మరియు ఎన్‌ ఫోర్స్‌

మెంట్‌ రిపోర్ట్‌ ఆధారంగా చర్యలు చేపట్టడం ఉండదు. ఏసీబీ, కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ ద్వారా

సమగ్ర విచారణ చేపడుతున్నామని తెలిపారు. రిపోర్టు ఆధారంగా ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి పై

ఇప్పటివరకు చేపట్టలేదని.. ప్రశ్నించగా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని

తెలిపారు. గత ఆరు నెలల నుండి రోగులకు మందులు అందక ఇబ్బంది పడుతున్నారని

ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా ఫోన్ను కట్‌ చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close