షావోమి సరికొత్త ‘ఎలక్ట్రిక్‌ బైక్‌’ వచ్చేస్తోంది!

0

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ షావోమి.. అన్ని విభాగాల్లోకి విస్తరిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, మొబైల్‌ యాక్ససిరీస్‌, టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, ఇండక్షన్‌ స్టవ్‌లు.. ఇలా వివిధ రకాల ప్రొడక్టులతో దూసుకెళ్తోంది. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్‌ బైక్‌ (ఈ-బైక్‌)ను కూడా ఆవిష్కరించింది. షావోమి సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఆవిష్కరించింది. త్వరలో మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశముంది. దీని పేరు హిమో సీ20. దీని ధర దాదాపు రూ.26,000. కంపెనీ దైనందిన వాడకానికి అనుగుణంగా ఈ బైక్‌ను రూపొందించింది. ఈ ఈ-బైక్‌లో 36వాట్‌ 10ఏహెచ్‌ లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీ ఉంటుంది. దీని కెపాసిటీ 360 డబ్ల్యూహెచ్‌. బరువు 2.5 కేజీలు ఉంటుంది. ఈ-బైక్‌లోని లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీని సులభంగానే చార్జ్‌ చేయవచ్చు. ఒక్కసారి ఈ బ్యాటరీకి ఫుల్‌గా చార్జింగ్‌ పెట్టడానికి 6 గంటల సమయం పడుతుంది. 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఈ బైక్‌ టాప్‌ స్పీడ్‌ గంటకు 40 కిలోమీటర్లు. దీని బరువు 21 కేజీలు. అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారైంది. షావోమి ఈ-బైక్‌లో 20 అంగుళాల రిమ్స్‌ ఉంటాయి. మెకానికల్‌ డిస్క్‌ బ్రేక్స్‌ కూడా ఉన్నాయి. ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, టెయిల్‌ లైట్స్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే ఇందులో ఎల్‌ఈడీ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఇందులో స్పీడ్‌, ఎంత దూరం ప్రయాణించాం, బ్యాటరీ పర్సంటేజ్‌, పెడల్‌ అసిస్ట్‌ లెవెల్‌ వంటి సమాచారం చూడొచ్చు. ఈ బైక్‌ ఇండియన్‌ మార్కెట్‌లోకి ఎప్పుడు వచ్చేది తెలీదు. కానీ మన మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here