Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

హిమాలయాల్లో శంబాల నగరం

బాహ్య ప్రపంచం వెతుకులాట

  • ఆశపడ్డ హిట్లర్‌
  • ‘అవతార్‌’ లాంటి మనుషులు
  • ఆదీ అంతం లేని ‘శ్వేత దీపం’

(హిస్టరీలో మిస్టరీ కథనం-3)

ఎవరైనా పిల్లలు తప్పిపోతే వెతుకుతారు. నగలు, నగదు పోతే వెతుకుతారు. దొంగల కోసం వెతుకుతారు. నిధులు, నిక్షేపాల.కోసం వెతుకుతారు… కానీ బాహ్య ప్రపంచం మాత్రం కనిపించని నగరం కోసం ఏకంగా శతాబ్దాల తరబడి వెతకటం ఓ మిస్టరీ. దేశానికి పెట్టని గోడలా ఉన్న హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. అవి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. పరమశివుడు కొలువైన హిమాలయం ఎప్పటికీ అలాగే ఉంటుందేమో..! ప్రపంచ రహస్య ప్రదేశం ఒకటి హిమాలయాల్లో ఉంది. అదీ ఎవ్వరికీ కనిపించకుండా దాగిన ‘శంబాలా నగరం’. ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వికులు చాలామంది చెబుతారు. కాని ఎవ్వరూ ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు. నియంత హిట్లర్‌ ఈ ప్రదేశం గురించి వెతికి, వెతికి అలిసిపోయాడు. శంబాలా నగరంపై కొన్ని నమ్మలేని మిస్టరీ నిజాలు.

కనిపించని నగరంపై కనిపించే పరిశోధనలు:

కొన్ని పరిశోధనలు, అలాగే కొన్ని భారతీయ గ్రంధాలు, ఇంకా బౌద్ధ గ్రంధాలలో రాసిన దానిని బట్టి హిమాలయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ నగరం ఉందని దానిపేరు శంబాలా అని తెలుస్తోంది. దాన్ని ‘హిడెన్‌ సిటీ’ (కనిపించని నగరం) అని కూడా పిలుస్తారు. వందల వేల మైళ్ల విస్తీర్ణం కలిగిన హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో ఆ నగరం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశానికి మనుషులు చేరుకోవడం అసాధ్యమని కూడా పాశ్చాత్యులు చెబుతున్నారు.

ప్రాణాలపై ఆశలు వదులుకొని..:

అదొక పవిత్రమైన ప్రదేశమని…అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని ఆ నగరాన్ని చూడాలంటే ఎంతో తపస్సు చేయాలని కూడా చెబుతారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ప్రాణాలపై ఆశను వదిలేసుకోవాలని కూడా చెప్పాల్సి ఉంటుంది. అంత సీక్రెట్‌ గా దాగి ఉన్న ఆ నగరాన్ని గురించి కొన్ని విషయాలను కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని పణంగా పెట్టి సేకరించగలిగారు. వారు సేకరించిన విషయాల ప్రకారం ఆ నగరం శివుడు కొలువైన ‘మౌంట్‌ కైలాష్‌’ పర్వతాలకు దగ్గరలో ఉంటుందని తెలుస్తోంది.

బౌద్ధ గ్రంథంలో..: ఆ ప్రదేశం అణునిత్యం అత్యంత సువాసన వెదజల్లుతూ ఉంటుందని అక్కడ నివసించేవారు నిరంతరం సుఖసంతోషాలతో జీవిస్తుంటారని వారికి బాధలన్నవే తెలియవని కూడా చెబుతారు. ఇదే విషయాన్ని బౌద్ధ గ్రంధాలు సైతం చెబుతున్నాయి.

మనకంటే విదేశీయులకే ఆసక్తి ఎక్కువ:

భారతదేశంలో ‘కర్మ’ సిద్దాంతం ఎక్కువ మంది నమ్మతారు. అందుకే భారతీయులు ఈ నగర పరోశోధన వైపు చూడటం లేదు. పాశ్చాత్యులు మాత్రం శంబాల నగర ప్రదేశాన్ని ‘ది ఫర్బిడెన్‌ ల్యాండ్‌’ అని ‘ది ల్యాండ్‌ ఆఫ్‌ వైట్‌ వాటర్స్‌’ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చైనీయులకు కుడా ఈ శంబాలా నగరం గురించి వారి ఇతిహాసాల ద్వారా తెలుసు.

కొత్తయుగం 2424 :

పురాతన గ్రంధాల ప్రకారం లోకంలో పాపం అరాచకత్వం పెరిగిపోయినప్పుడు ఈ నగరంలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అప్పటి నుంచి కొత్త యుగం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఆ కాలం 2424 లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియచేశాయి.

రష్యా మిలటరీ…:

‘శంబాలలో నివసించే వారు మహిమాన్వితులు’ అని తెలుసుకున్న రష్యా ఆ నగరం రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలటరీ ఫోర్సును పంపి పరిశోధనలు కూడా చేయించింది. ఇది 1920లో జరిగిందని ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పుడు శంబాలాకి చేరుకున్న రష్యా మిలటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి సైన్యాలఖు తెలిపారని కూడా ఆ ఆధారాలు చెబుతున్నాయి. అయితే శంబాల గురించి మాత్రం సూది మొనంత కూడా పసిగట్టలేక రష్యా సైనాలు వెనుదిరిగాయి.

వర్కవుట్‌ కాని హిట్లర్‌ లుక్‌:

అద్భుతాలు అంటే ఇష్టపడే నాజి నియంత హిట్లర్‌ కూడా 1930లో శంబాలా గురించి తెలుసుకొవడానికి, దాన్ని పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన ‘హేన్రిచ్‌ హిమ్లర్‌’ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని నాజినేత హిట్లర్‌ కి చెప్పాడు. దాంతో ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్న హిట్లర్‌ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంభాలాకు పయనం కట్టాడని, అక్కడి ఆధ్యాత్మిక వేత్తలతో కలిసి వారి సహయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త.బ్లొవెటస్కీ ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు విశ్వ మానవులు అంతా షాక్‌ తిన్నారు. అయితే హిట్లర్‌ పన్నాగాన్ని శంబాలా అధ్యాత్మిక వేత్తలు పడనివ్వలేదు. దానితో చేసేది ఏవిూ లేక హిట్లర్‌ వట్టి చేతులతో వెనకకి తిరిగాడని ఆమె తెలిపారు. వాటిల్లో ‘నిజమెంత’ అనేది ప్రత్యక్షంగా ఆనాడు చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. అంతే కాక ఆ ప్రదేశాన్ని సందర్శించిన హిమ్లర్‌ శంబాలా నగరంలో మరెన్నో వింతలు, విశేషాలు మనవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడని అంటారు. అయినా హిమాలయాల్లో ఉండే అనుభూతి వేరు కదా..!.

కాలచక్రంలో…:

ఇదంతా ఓ ఎత్తయితే…గోభి ఎడారికి దగ్గరిలో ఉన్న శంబాలానే రాబోయే రొజులలొ ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలో రాసాడని మరి కొంతమంది వాదన. దీన్నే పాశ్చాత్యులు ‘ప్లానెట్స్‌ ఆఫ్‌ హెడ్‌ సెంటర్‌’గా పిలుస్తారు.

యూరప్‌ వనిత – నూటక్క ఏళ్ళు:

ఫ్రాన్స్‌ చారిత్రక పరిశోధకురాలు, బౌద్ద మత అభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్‌ నీల్‌ కూడా ఈ నగరాన్ని పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తన 56 ఏళ్ళ వయస్సులో ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి వారు ఆశీస్సులు పొందింది. అందువల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలం బ్రతికిందని అంటారు. ఆమె అక్టోబర్‌ 24, 1868లో జన్మించి సెప్టెంబర్‌ 8, 1969లో మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్‌ లొ కాలు మోపిన తొలి యూరప్‌ వనిత ఆమెనని కూడా తెలుస్తోంది.

వారికి ‘టెలిపతి’ తెలుసు:

ఇక షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్‌ లాయోనిన్‌ కూడా ‘శంబాలా అనేది భుమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన’ అంటూ పేర్కొంటారు. ‘ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు’ అని తెలిపాడు. అక్కడి వారు ‘టెలిపతి’తో ‘ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ది అయినా, విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది’ అని తెలిపారు. నాటి కాలానికి చెందిన ‘లామా మింగ్యుర్‌ డోన్డప్‌’ చెప్పిన దాని ప్రకారం శంబాలా వయస్సు అర మిలియన్‌ సంవత్సరాలని తెలుస్తోంది.

‘అవతార్‌’ మనుషులు:

శంబాలా ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారని తెలుస్తోంది. వారు అనేక శక్తులు కలిగి ఉన్నారని ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం కూడా వారికుందని పురాతన గ్రంధాలు సైతం చెబుతున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం హిమాలయాలను దాటుకుంటూ పోతే చైనాలోని గోభి ఎడారి వస్తుందని..దీనికి ‘అంతు దరి’ ఉండదని, దాన్ని దాటిన తర్వాత ఈ నగరం కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘హిమ’ మధ్యలో..:

హిమాలయాల నడిబొడ్డులో హిమవన్నాగాల మధ్య మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు దాటుకుంటూ పోతే ఈ రహస్య నగరం కనిపిస్తుందని ఒకవేళ ఆ ప్రదేశానికి చేరుకుంటే చావుకు దగ్గరగా చేరుకున్నట్లేనని బౌద్ధ గ్రంధాలు చెబుతున్నాయి. కొంతమంది పరిశొధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంబాలా టిబెట్‌ హిమాలయాలలోని ‘కున్లున్‌ పర్వత సమూహంతో కలిసి ఉండొచ్చు’ అని అంటారు. ఆ శంబాలానే ‘శ్వేత దీపం’ అని ‘ద్రువలోకం’ అనే పేర్లతో పిలుస్తారని వారు చెబుతున్నారు. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఇప్పటివరకు మిస్టరీనే.. అంతే కాదు ఆ ప్రదేశమనేది ఉందా..? అసలు ఉంటే ఎలా కనుక్కోవాలనేది..? ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి చారిత్రక పరిశోధకులు ఈ ఊహాజనిత శంబాల నగరాన్ని బయటి ప్రపంచానికి అందించే రోజు కొరకు వేచి చూడాల్సిందే.! అప్పటిదాకా ఆ నగరం హిస్టరీలో ఓ మిస్టరీ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close