రాజ్‌ తరుణ్‌కు జోడిగా షాలిని పాండే

0

కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ తరువాత పూర్తిగా గాడి తప్పాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో ఈ యువ కథానాయకుడి కెరీర్‌ కష్టాల్లో పడింది. దిల్‌ రాజు లాంటి స్టార్‌ ప్రొడ్యూసర్‌ బ్యానర్‌లో తెరకెక్కిన లవర్‌ సినిమా కూడా బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడింది. దీంతో లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న రాజ్‌ తరుణ్‌ మరోసారి దిల్‌ రాజు బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఇద్దరి లోకం ఒకటే అనే పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాకు జీఆర్‌ కృష్ణ దర్శకుడు. ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌కు జోడిగా అర్జున్‌ రెడ్డి ఫేం షాలిని పాండే నటించనుంది. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన షాలిని కెరీర్‌ కూడా టాలీవుడ్‌ లో ఆశించిన స్థాయిలో సాగటం లేదు. మరి ఈ సినిమా అయినా రాజ్‌ తరుణ్‌, షాలినిలకు బ్రేక్‌ ఇస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here