కొప్పుల పేరిట షాడో నేతలు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల సహకారం మరవలేనిది. అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాకారమయ్యేలా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి, రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌ పార్టీ కన్నా ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కే ప్రజలు సాధారణ ఎన్నికల్లో పట్టం కట్టడం కాంగ్రెస్‌ పార్టీ బలహీనతను ఎత్తి చూపెట్టింది. తెలంగాణ ఇచ్చినందుకు లబ్దిపొం దడం మరచిపోయింది. అంతేకాక గత నాలుగు న్నరేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష పాత్రను కూడా సరిగ్గా పోషించలేకపోయిందన్న అపప్రద మూటగట్టు కుంది. రాజకీయాల్లో గతాన్ని విస్మరించకమా నదన్నట్లుగా జంప్‌ జిలానీలు పెరిగిపోయి వారివారి భవిష్యత్‌ బాటలు చక్కగా ఉండేలా చూసుకుంటున్నారు కొందరు నేతలు. ఇక రోజురోజుకు కొత్త ఓటర్లు నమోదవుతున్న నేపథ్యంలో ఫైర్‌ బ్రాండ్‌ నాయకులకే పాపులారిటీ పెరిగిపోతుంది తప్ప ఇతర నేతలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారన్నది నిర్వివాదాం శం. అందుకే ఎన్నికల కమిషన్‌ కూడా స్టార్‌ కాంపైనర్‌ అనే పదాన్ని ఉపయోగిస్తూ మార్గదర్శకాలు కూడా జారీచేసింది. ఇవన్నీపోనూ కురువృద్ధ కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు అందించడానికి రాహుల్‌ గాంధీ అధ్యక్షతన యువతను ప్రోత్సహిస్తున్నా అంతర్గత కుమ్ములాటలు మాత్రం పోలేదని అంతరంగిక సమాచారం. సీనియర్‌ నాయకులైన దిగ్విజయ్‌ సింగ్‌, అశోక్‌ గెహ్లాట్‌, గులాం నబి ఆజాద్‌లను సైతం పక్కనపెడుతూ వారి అనుభవజ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం ఆత్మహత్యా సదృశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేటికీ రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీని ఢీకొట్టేంత శక్తిసామర్థ్యాలు గల ప్రతిపక్షనేతగా ఎదగకపోవడం కాంగ్రెస్‌ పార్టీకి అవరోధంగా పరిగణిచాల్సిందేనని ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయం. రాహుల్‌ ఇటీవల పర్యటనలో భైంసా, కామారెడ్డి, చార్మినార్‌ ప్రచారాల్లో ప్రజలకు అంతగా అర్థంకాని ”రాఫెల్‌ డీల్‌”పై మాట్లాడటం కాంగ్రెస్‌ పార్టీలోని ప్రణాళికా లేమిని కొట్టొచ్చినట్లుచూపుతోందనడంలో ఏమాత్రం సంశయమే లేదు. అది నిజంగా జాతీయాంశమే అయినా మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేంతగా ప్రధానితో కానీ లేదా రక్షణ శాఖ మంత్రితో కానీ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరే పని చేయలేకపోతున్నాడు రాహుల్‌ గాంధీ. ఇక రాష్ట్ర రాజకీయాల్లో రాహుల్‌ అంతరంగికుడుగా ఉన్న మాజీ ఐఏయస్‌ పాత్ర ఎక్కువైపోయిందని అదికూడా సరైనా దశా-దిశా, నిర్దేశం లేకుండా పోతోందన్నది పార్టీలోని కొందరి ప్రముఖుల ఆవేదన. కొప్పుల మనిషని చెప్పుకుంటున్న ముషీరాబాద్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ నేత (గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున యంపీగా పోటీచేసారు) దానం నాగేందర్‌ పట్ల వ్యవహరించినతీరే పొమ్మనలేక పొగపెట్టినట్లయిందని, తద్వారా దానం పార్టీ వీడాల్సివచ్చిందని తెలిసింది. ఈ విషయంపై దానంనే ఆరాతీసిన ఆజాద్‌కు సమాచారం తెలిసినా ఏఐసీసీ పెద్దగా ఏవిూచేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయారని తెలుస్తోంది.

రాహుల్‌ ఇటీవల పర్యటనలో భైంసా, కామారెడ్డి, చార్మినార్‌ ప్రచారాల్లో ప్రజలకు అంతగా అర్థంకాని ”రాఫెల్‌ డీల్‌”పై మాట్లాడటం కాంగ్రెస్‌ పార్టీలోని ప్రణాళికా లేమిని కొట్టొచ్చినట్లుచూపుతోందనడంలో ఏమాత్రం సంశయమే లేదు. అది నిజంగా జాతీయాంశమే అయినా మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేంతగా ప్రధానితో కానీ లేదా రక్షణ శాఖ మంత్రితో కానీ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరే పని చేయలేకపోతున్నాడు రాహుల్‌ గాంధీ. ఇక రాష్ట్ర రాజకీయాల్లో రాహుల్‌ అంతరంగికుడుగా ఉన్న మాజీ ఐఏయస్‌ పాత్ర ఎక్కువైపోయిందని అదికూడా సరైనా దశా-దిశా, నిర్దేశం లేకుండా పోతోందన్నది పార్టీలోని కొందరి ప్రముఖుల ఆవేదన. కొప్పుల మనిషని చెప్పుకుంటున్న ముషీరాబాద్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ నేత (గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున యంపీగా పోటీచేసారు) దానం నాగేందర్‌ పట్ల వ్యవహరించినతీరే పొమ్మనలేక పొగపెట్టిన ట్లయిందని, తద్వారా దానం పార్టీ వీడాల్సివచ్చిందని తెలిసింది. ఈ విషయంపై దానంనే ఆరాతీసిన ఆజాద్‌కు సమాచారం తెలిసినా ఏఐసీసీ పెద్దగా ఏవిూచేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయారని తెలుస్తోంది. ఇక ఓ సామాజిక వర్గానికి చెందిన పీసీసీ ముఖ్యనేత ఒకరు వివేక్‌, వినోద్‌ల పునరాగమనాన్ని అడ్డుకున్నారని తాను మాత్రమే ఆ సామాజికవర్గం నుండి కీలకనేతగా ప్రాతినిధ్యం వహించేలా చూసుకుంటున్నారని భోగట్టా.ఇలా ఒక షాడో నేత బీసీల ఉద్ధరణంటూ, ఇంకో ముఖ్యనేత తమ సామాజికవర్గ అభివృద్ధంటూ ప్లకార్డులు పట్టుకున్నా చిత్తశుద్ధి కొరవడిన నేతలు వారంటూ పార్టీలోని వారే గగ్గోలుపెడుతున్నారు. కొసమెరుపేమిటంటే కాంగ్రెస్‌ పార్టీలోని కోవర్టులూ పార్టీని నడిసంద్రంలో ముంచేవారిలా తయారయ్యారన్నదే. ఇక మునిగే నావలోనివారంతా ”నడిపించు నా నావా నడిసంద్రమున దేవా” అని పాడుకోవాల్సిందే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here