ప్రత్యేక రోజుల్లో శబరిమలకు మహిళా భక్తులు?

0

తిరువునంతపురం: శబరిమలను 10 నుంచి 50ఏళ్ల వయస్సు గల మహిళలు ప్రత్యేక రోజు ల్లో దర్శించుకునేలా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై ఆలయ ప్రధాన పూజారి, పందలం ప్రతినిధులతో చర్చిస్తామన్నారు. శబరిమల వివాదంపై చర్చిం చేందుకు నేడు కేరళలో అఖిల పక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సీఎం విజయన్‌ మీడియాతో మాట్లాడారు. ఇవే విష యాలను తాను అఖిలపక్ష సమావేశంలోనూ స్పష్టం చేశానన్నారు. భాజపా, కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును తాము అమలు చేస్తామన్నారు. ప్రజల నమ్మకాల కన్నా వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆందోళనకారులు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని ఆయన కోరారు. ప్రభుత్వం ఎటువంటి పక్షపాతం చూపటంలేదని, కేవలం అత్యున్నత న్యాయస్థానం తీర్పును మాత్రమే అమలు చేస్తోందన్నారు. భక్తులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి భద్రత కల్పిస్తుందని విజయన్‌ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ వాకౌట్‌.. కాగా.. శబరిమల అంశంపై నేడు ప్రభుత్వం చేపట్టిన అఖిలపక్ష సమావేశం నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవట్లేదని, ఇది భక్తులకు సవాల్‌గా మారుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. శబరిమలలో శాంతి నెలకొల్పేందుకు వచ్చిన ఓ సువర్ణావకాశాన్ని సీఎం వ థా చేశారని వారు దుయ్యబట్టారు. అటు భాజపా కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రభుత్వం శబరిమలను రణరంగంగా మార్చాలని చూస్తోందని భాజపా నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించి సంప్రదాయాలను పరిరక్షించాలని భాజపా నేతలు కోరడం గమనార్హం.

నాకు ఏం జరిగినా సీఎందే బాధ్యత: తప్తి నవంబర్‌ 17 సాయంత్రం నుంచి మండల పూజ కోసం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీంతో మరోసారి శబరిమలలో ఉద్రికత్త చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భక్తులు వారిని అడ్డుకోవడంతో గందరగోళం తలెత్తింది. రెండు పర్యాయాలు శబరిమల అట్టుడుకి పోయింది.

ప్రస్తుత తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఓపెన్‌ కోర్టులో (బహిరంగ విచారణ) విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 22న విచారణ జరుగుతుందని న్యాయస్థానం పేర్కొంది. సామాజిక కార్యకర్త, భూమాత బ్రిగేడ్‌ వ్యవస్థాపకురాలు త ప్తి దేశాయ్‌ శబరిమలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. తనకు తగినంత భద్రత కల్పించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆమె ఓ లేఖ రాశారు. తన లేఖపై కేరళ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో త ప్తి దేశాయ్‌ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కేరళ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు. కచ్చితంగా శబరిమల ఆలయానికి వెళ్తాను. ఒకవేళ ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మాత్రం కేరళ సీఎం విజయన్‌, రాష్ట్ర డీజీపీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. శబరిమల ఆలయ ప్రవేశానకి భద్రత కోరితే స్పందించక పోవడం దారుణమని’ త ప్తి దేశాయ్‌ వ్యాఖ్యానించారు.

మండల పూజ కోసం నవంబర్‌ 17న తెరవనున్న ఆలయాన్ని తిరిగి డిసెంబరు 27న మూసేయనున్నారు. అనంతరం మక్కరవిళక్కు కోసం డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు తెరిచి ఉంచుతారు. మరోవైపు నిషేదిత వయసున్న 500 మంది మహిళలు కూడా అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో గుర్తింపు కార్డు ప్రస్తావన కూడా ఉండదు. కనుక మహిళల వయసు వివరాలపై స్పష్టత ఉండదు. గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, సీఎం విజయన్‌ ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

యూఎస్‌లో టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార కార్యాలయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here