Featuredప్రాంతీయ వార్తలు

తెరుచుకున్న శబరిమల

  • శబరిమల వద్ద భారీగా మొహరించిన పోలీసులు
  • ఆలయం తెరుచుకోనుండడంతో గట్టి నిఘా
  • పదిమంది మహిళా భక్తులను వెనక్కి పంపివేత
  • మహిళా భక్తులు రావద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు

తిరువనంతపురం

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. పంబ నుంచి దీక్ష స్వీకరించిన స్వాములు దర్శనానికి బయల్దేరారు. ప్రధాన పూజారి కండారు మహేశ్‌ మోహనారు, ముఖ్య పూజారి ఏకే సుధీర్‌ నంబూద్రి ఆలయంలో శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గర్భగుడిని తెరిచారు. నేటి నుంచి డిసెంబర్‌ 27 వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. అచంచలమైన భక్తి ప్రపత్తుల మధ్య నియమ నిష్ఠలతో దీక్షలు చేపట్టిన అయ్యప్ప భక్తులు స్వామియే శరణం అయ్యప్ప.. అంటూ ప్రారంభ దర్శనానికి పోటెత్తారు. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా కేరళ సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా దాదాపు 10వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కాగా శబరిమలను సందర్శించాలనే మహిళలు కోర్టు ఉత్తర్వులతో వస్తే భద్రత కల్పిస్తామని కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ స్పష్టం చేశారు. శబరిమల ఆలయం ఆందోళనలు చేపట్టే ప్రాంతం కాదు..తృప్తి దేశాయ్‌ వంటి సామాజిక కార్యకర్తలు తమ బలప్రదర్శన చేసే స్థలం కాదని చెప్పారు. ఏమైనా మహిళా భక్తులు కోర్టు ఉత్తర్వులతో రావాలని సూచించారు. మీడియా ప్రతినిధులు సైతం సంయమనం పాటించాలని, సంచలనం కోసం ప్రయత్నించే వ్యక్తులు, నేతల అత్యుత్సాహానికి సహకరించరాదని స్పష్టం చేశారు. కాగా శతాబ్దాల తరబడి రుతుక్రమం పాటించే మహిళలను శబరిమల ఆలయానికి అనుమతించని నిబంధనలను బేఖాతరు చేస్తూ సుప్రీం తీర్పు నేపథ్యంలో గత ఏడాది పూణెళికు చెందిన మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ శబరిమలలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.మరోవైపు నవంబర్‌ 20 తర్వాత తనకు ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా శబరిమల సందర్శిస్తానని తృప్తి దేశాయ్‌ స్పష్టం చేశారు. తమకు భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరతానని, ప్రభుత్వం ఏ నిర?ణయం తీసుకున్నా దర్శనం కోసం తాను శబరిమల వెళ్లితీరతానని ఆమె చెప్పారు. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి యువతుల ప్రవేశం గురించి తాము న్యాయ సలహాను తీసుకుంటామని ట్రావన్‌కోర్‌ దేవసం బోర్డు అధ్యక్షుడు ఎన్‌ వాసు వెల్లడించారు. ఇదిలావుంటే శనివారం నుంచి డిసెంబర్‌ 27వ తేదీ వరకు అయ్యప్పకు నిత్యపూజలు జరుగుతాయి. మహిళలను ఆలయ ప్రవేశానికి అనుమతించరాదని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమల వెళ్లిన తెలుగు మహిళలను పోలీసులు అడ్డగించారు. పదిమంది మహిళలను పోలీసులు పంబ నుంచి వెనక్కు పంపారు. పోలీసులు, మహిళలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ప్రచారం కోసం మహిళలు ఎవరూ ఆలయానికి రావొద్దని కేరళా మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తుల ఆగ్రహానికి గురైతే ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మహిళల ప్రవేశ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు నివేదించింది. సుప్రీం తాజా నిర్ణయంతో మహిళలకు ప్రవేశం కల్పించరాదని కేరళ సర్కారు నిర్ణయించింది. ఆలయ ప్రవేశం కోరుకునే మహిళలు కోర్టు అనుమతి తెచ్చుకోవాలని తెలిపారు.

10 మంది తెలుగు మహిళల్ని వెనక్కి పంపిన పోలీసులు

స్వామి దర్శనార్థం శబరిమలకు వెళ్లిన నిషేధిత వయసున్న విజయవాడ మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. అయ్యప్ప దర్శనానికి వచ్చిన 10 మంది తెలుగు మహిళల వయసు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి వారిని వెనక్కి పంపారు. దీంతో పోలీసులకు, మహిళలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలను ముందుకు పంపడం కుదరడంలేదని పోలీసులు స్పష్టంచేశారు. ఇక చేసేదేమీ లేక వారంతా తిరుగుముఖం పట్టారు.

ప్రచారం కోసం శబరిమలకు రావొద్దు: కేరళ మంత్రి

గతేడాది జరిగిన ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కేరళ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేవలం ప్రచారం కోసం శబరిమలకు రావాలనుకునే మహిళలకు రక్షణ కల్పించబోమని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్‌ ప్రకటించారు. మీడియా ప్రచారం కోసం ఎవరూ శబరిమలకు రావొద్దన్నారు. ఆందోళనలు నిర్వహించడానికి శబరిమల వేదిక కాదని ఆయన తేల్చి చెప్పారు. కేవలం ప్రచారం కోసం ఆలయ ప్రవేశం చేస్తామని చెప్పేవారికి ప్రభుత్వ ఎలాంటి మద్దతూ ఇవ్వబోదన్నారు. ఒకవేళ 10-50ఏళ్ల లోపు మహిళలు వెళ్లాలనుకుంటే అందుకనుగుణంగా కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అలాగే, మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సెప్టెంబర్‌ 28న ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు కూడా నిరాకరించిన విషయం తెలిసిందే.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close