ఫీలిప్పిన్స్‌లో వరుస బాంబు పేలుళ్లు..

0

మనీలా : ఫిలిప్పీన్స్‌లో ముష్కరులు పేట్రేగిపోయారు. దక్షిణ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలోని రోమన్‌ కాథలిక్‌ కాథడ్రల్‌ చర్చి లక్ష్యంగా రెండు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 27కి చేరింది. 70 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. ముస్లిం మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండే జోలో ప్రాంతంలోని కాథడ్రల్‌ చర్చికి సవిూపంలో మొదటగా బాంబు పేలుడు చోటుచేసుకుంది. అనంతరం చర్చి ఆవరణలో ముష్కరులు మరో పేలుడుకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఘటనాస్థలికి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. క్షతగాత్రుల్లో పలువురిని హెలికాప్టర్లలో సవిూపంలోని జాంబోంగా నగరానికి తరలించారు. ఈ ఘటనపై ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి డెల్ఫిన్‌ లోరెన్జనా స్పందించారు. అన్ని ప్రాంతాల్లో భద్రత పెంచాలని.. ప్రార్థనాస్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇప్పటివరకూ

ఏ సంస్థ ప్రకటించుకోలేదు. జోలో ద్వీపంలో అబు సయ్యఫ్‌ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సంస్థను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. గత కొంత కాలంగా ఈ ఉగ్రవాద సంస్థ ఆ ప్రాంతంలో బాంబు పేలుళ్లు, కిడ్నాప్‌లు, శిరచ్ఛేదనలకు పాల్పడుతూ మారణ¬మాన్ని సృష్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here