సప ‘రేటు’ ప్రచారం

0

ఏరోజుకారోజు పొట్ట పోసుకోవడానికి ఎవరు డబ్బులు చెల్లిస్తే అదే వారి పార్టీ. ఆ నాయకుడి వెంటే ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి అభిమానులు, కార్యకర్తలకు నగరంలో విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ఎన్నికల ప్రచారం ఊపందుకొంటున్న తరుణంలో వీరికి నిత్యం కూలీ దొరుకుతోంది. ఎండలో ఎండి… ఒళ్లంతా హూనం చేసుకొని.. తట్టలు మోస్తే రూ.300 సంపాదించడమే గొప్ప. అదే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే రూ.500 చేతిలో పడుతున్నాయి. ఇక ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, వాహనం ఉంటే పెట్రోలు ఇతర ఖర్చులు సరేసరి. మహిళలు, యువతకు డిమాండ్‌.. ఉపాధి వెతుక్కొంటూ నగరానికి వచ్చిన చాలా మంది నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేస్తుంటారు. రోజు కూలీ వీరికి ఆధారం. పనిలేకపోతే ఆ రోజు ఇంటివద్దే. ఎన్నికలు వారందరికీ మంచి పని కల్పిస్తున్నాయి. అందునా మహిళలు, యువతకు మంచి డిమాండ్‌ ఉంది. మర్నాడు ఏ పార్టీ ప్రచారానికి వెళ్లాలనేది ముందురోజు సాయంత్రమే తేలిపోతుంది. అందరినీ అనుసంధానం చేసి ప్రచారానికి తీసుకెళ్లే బాధ్యతను ఒక వ్యక్తి తీసుకుంటాడు. ప్రచారం ముగిసిన తర్వాత ఆ రోజుకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తుంటాడు. నగరంలో ప్రచారానికి జన సవిూకరణ నాయకులకు దడ పుట్టిస్తోంది. వాస్తవానికి అభిమానంతో వచ్చే వారు కొద్ది మందే. మిగత వారందర్నీ ఏరోజుకారోజు సవిూక రించాల్సిందే. కొందరు నేతలైతే ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు తన వెంటే తిరగాలంటూ … గంపగుత్తగా మాట్లాడుకొని తిప్పుకొంటున్నారు. మరికొందరు వారానికి పది రోజులకు మాట్లాడుకొని ప్రచారంలో పాల్గొనేలా చేస్తున్నారు. ఈ విషయాలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.

భారీగానే ఖర్చు.. ఇంకా ఎన్నికల ప్రచారం ఊపందుకోకముందే ఖర్చులు అభ్యర్థులను ఠారెత్తిస్తున్నాయి. ఇప్పటికే టిక్కెట్లు ఖరారైన వారు, ఆశావహులు కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి అభ్యర్థి చుట్టూ 100-200 మంది వరకు ‘ప్రత్యేక’ కార్యకర్తలు నిత్యం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉదయం సాయంత్రం వరకు కాలనీలు, బస్తీలు చుట్టి వస్తున్నారు. అభ్యర్థులు అంతా తమతోపాటు నిత్యం 200 మంది కిరాయి కార్యకర్తలను వెంట తిప్పుకోవాలంటే తక్కువలో తక్కువ రూ.1.50 లక్షలు వెచ్చించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here