చెప్పిన కథ వేరు.. సినిమాలో చూపించింది వేరు!

0

హీరోయిన్‌ కమ్‌ ఐటెం సాంగ్స్‌ బ్యూటీ రాయ్‌ లక్ష్మి తెలుగులో చాలా పాపులర్‌. మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ ఫిలిం ‘ఖైది నెం.150’ లో రత్తాలు రత్తాలు అంటూ సాగే ప్రత్యేక గీతంలో నర్తించడంతో ఆమె సూపర్‌ పాపులర్‌ అయింది. ఇప్పటికీ చాలామంది రాయ్‌ లక్ష్మిని రత్తాలు అని పిలుస్తారంటేనే ఆ పాట ఎంత క్రేజ్‌ తీసుకోచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే రాయ్‌ లక్ష్మీ పై ఎందుకో రూమర్లు చాలా వస్తుంటాయి. రీసెంట్‌ గా ఒక ఇంటర్వ్యూలో వాటిపై స్పందించింది. ఇంకా చాలా విషయాలు పంచుకుంది. ఈమధ్య మీరు నటించే తెలుగు సినిమాల సంఖ్య ఎందుకు తగ్గింది అని అడిగితే.. ఈమధ్య బాలీవుడ్‌ సినిమాలో నటించడం ఇతర భాషలలో బిజీగా ఉండడంతో అలా జరిగిందని చెప్పింది. బాలీవుడ్‌ రాయ్‌ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ‘జూలీ 2’ సినిమా నిరాశ పరచడంపై అడిగితే ”నాకు వాళ్ళు చెప్పిన కథ వేరు.. సినిమాలో చూపించింది వేరు. నా పాత్రను వ్యాంప్‌ లాగా చూపించడంతో కుటుంబ ప్రేక్షకులు దూరమయ్యారు” అని తెలిపింది. మీరు పూర్తి స్థాయి హీరోయిన్‌ పాత్రల్లో నటించడం కంటే స్పెషల్‌ సాంగ్స్‌ లో నటించేందుకు ఎందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తారు అని అడిగితే.. సినిమాల్లో హీరోయిన్‌ గా నటించి రెండున్నర గంటలు కనిపించినా ఒక్కోసారి క్రేజ్‌ రాదు. కానీ అదే క్రేజ్‌ స్పెషల్‌ సాంగ్స్‌ లో జస్ట్‌ ఇదు నిముషాలు కనిపిస్తే వస్తుందని.. అంతే కాకుండా ఎక్కువ రెమ్యూనరేషన్‌ కూడా లభిస్తుందని.. అందుకే వాటిని యాక్సెప్ట్‌ చేయాల్సి వస్తుందని తెలిపింది. లక్ష్మీ రాయ్‌ ప్రెగ్నెంట్‌ అనే రూమర్లు ఈమధ్య తెగ హల్చల్‌ చేశాయి. కొందరితో ఎఫైర్లు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది.. వీటిపై స్పందిస్తూ ”నిజానిజాలు తెలుసుకోకుండా నాపై రూమర్లు ప్రచారం చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. కానీ నా జీవితంలో ఎఫైర్లకు స్థానం లేదు. గతంలో నేను మూడు సార్లు ప్రేమ విషయంలో మోసపోయాను. నా తప్పు ఏంటో తర్వాత అర్థం అయింది. ఇప్పుడు అలాంటి రిలేషన్స్‌ కట్‌ చేశాను. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా సినిమాలపైనే ఉంది” అని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here