Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

పల్లెల్లో పంచాయితీల సెగ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం స్తబ్ధుగా ఉన్న రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. వరుసగా పంచాయితీ మొదలుకుని పార్లమెంట్‌ వరకు ఇక ఎన్నికల సందడే కనిపించనుంది, తొలుత పంచాయితీ ఎన్నికలు జరుగనుండగా గ్రామా ల్లో అప్పుడే సందడి మొదలయ్యింది. మరోవైపు పంచాయితీల్లో బిసి రిజర్వేషన్ల వ్యవహారం కూడా సెగ పుట్టిస్తోంది. జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో రాజకీయపక్షాలు అన్ని పంచాయతీల్లో పట్టు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు తమ సత్తాచాటు కనేందుకు తెరాస సిద్ధమవుతోంది. రానున్న స్థానిక, పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని తమ వ్యూహానికి పదును పెడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తోంది. తెరాస సమరోత్సాహంతో పంచాయతీనుంచి పార్లమెం టు వరకు తమ సత్తాచాటుకునేందుకు సమా యత్తం అవుతుండగాకాంగ్రెస్‌,బిజెపిలు మొన్నటి అసెంబ్లీ ఫలితాల నుంచి తేరుకుని సత్తా చాటాలని చూస్తున్నాయి. అసెంబ్లీ ఫలితాలు పంచాయతీల్లో సాధించే దిశగా టిఆర్‌ఎస్‌ తన కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తోంది. పంచాయతీ బాధ్యతలను నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యులకు పార్టీ అధిష్ఠానం కట్టబెట్టడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రిజర్వేషన్ల ఖరారు కొలిక్కి రావడంతో గ్రామ పంచాయతీల్లో సమర్దులైన అభ్యర్థులను తమ మద్దతుదార్లుగా రంగంలోకి దించేలా తెరాస కసరత్తు సాగిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థుల జాబితాను రిజర్వేషన్లకు అనుగుణంగా వడపోస్తూ.. ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి బీసీల రిజర్వేషన్లను అమాంతం తగ్గించడంపై ఆందోళనల బాట పట్టేలా విపక్షాలు ఏకమవుతున్నాయి. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా.. రాజకీయ కుట్రతో బీసీలకు రావాల్సిన కోటాలో కోతపెట్టారని అవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రిజర్వేషన్లలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి బీసీ సంఘాలతో కలిసి విపక్షాలు ఉద్యమబాట పట్టబోతున్నాయి.. తాము ఓటమికి భయపడకుండా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బలం పెంచుకుంటామని స్పష్టం చేస్తున్నాయి. ఇటు పంచాయతీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికలు కీలకం కావడంతో క్యాడర్‌ కాపాడుకుంటూనే ఆయా గ్రామాల్లో ఇటీవల ఆధిక్యం కనబరచిన చోట దీటైన సర్పంచి అభ్యర్థులను రంగంలో దించేలా వ్యూహం పన్నుతున్నారు. నియోజకవర్గాల్లో తెరాస ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యుల సొంత గ్రామాల్లో కొన్ని చోట్ల తెరాస కంటే ఆధిక్యత కనబర్చడం పట్ల భాజపా శ్రేణులు ఆనందంతో ఉన్నారు. రాష్ట్ర సర్కారు మెడలు వంచైనా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని పలు రాజకీయ పార్టీలు, బీసీ, ప్రజాసంఘాలు ఉమ్మడిగా ప్రకటించాయి. బీసీలను రాజకీయంగా అణగదొక్కితే ఊరుకోబోమని, రిజర్వేషన్లను 22శాతానికి తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశంపై సర్కారు దిగి వచ్చేంత వరకు ప్రజా ఉద్యమాలు, న్యాయపోరాటాన్ని సాగిస్తామని వెల్లడించాయి. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన రాజకీయ పార్టీలు, బీసీ, సామాజిక ఉద్యమ సంఘాలు, న్యాయనిపుణులతో హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి బిసి రిజర్వేషన్ల తగ్గింపుపై చర్చించింది. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీ సంఘాలు ఎవరికివారు జట్టు కట్టొద్దని, ఐకమత్యంగా పోరాడాలని సూచించారు. కేసీఆర్‌ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్నాకే ప్రధానిని కలవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు చట్ట సవరణ అవసరం లేదని, తెరాస ప్రభుత్వం కేంద్రాన్ని సాకుగా చూపుతోందన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కాపాడుకుంటే ఎంతోమంది ఆత్మగౌరవంతో ముందుకెళ్తారని, బీసీ నాయకులు సానుకూలంగా స్పందించి ఇందుకోసం ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. తమిళనాడు తరహా రిజర్వేషన్ల కోసం దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తానన్న కేసీఆర్‌ ఆ దిశగా ఎందుకు ప్రయత్నించడం లేదనికూడా ప్రశ్నించారు. ధర్నాలు, రాస్తారోకోలు, 28న అఖిలపక్ష నాయకులతో కలిసి గవర్నర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాల సమర్పణ, 29న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు హైకోర్టులో న్యాయపోరాటాన్ని సాగిస్తామని, సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. 3 రోజుల్లోగా సీఎం కేసీఆర్‌ స్పందించాలని కోరారు. మొత్తంగా ఇప్పుడు పంచాయితీ ఎన్నికల వ్యవహారం బిసిల రిజనర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. అయితే పంచాయితీ ఎన్‌ఇనకలకు గడువు సవిూపిస్తున్నందున కోర్టు తీర్పు మేరకు మాత్రమే ప్రభుత్వం ముందుకు సాగాల్సిన ఆగ్యం ఏర్పడింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close