Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

సీతమ్మ వాక్కు… కాసుల వర్షం..

కార్పొరేట్‌ కంపెనీలకు ఊరట

  • పన్నుశాతాన్ని కుదించిన కేంద్రం
  • ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లలో జోష్‌
  • కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌

మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో, దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు దూసుకెళ్లాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఫుల్‌ జోష్‌ పెంచాయి. తయారీ రంగానికి ఊతమిచ్చేలా దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును తగ్గించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటనలు చేశారు. దీంతో మార్కెట్‌ లాభాల బాటలో ట్రేడ్‌ అవుతోంది. కేవలం.. కొద్ది నిమిషాల్లో ముదుపర్ల సంపద రూ. 5 లక్షల కోట్లకు పైగా పెరగడం గమనార్హం. దాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిబంధన 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. 30శాతం నుంచి 25.17శాతానికి కొర్పొరేట్‌ పన్నును కుదిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశీయ కంపెనీలకు పన్ను కుదింపు వల్ల లాభం చేకూరనున్నట్లు అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం అయిన వార్షిక సంవత్సరం నుంచి ఈ నిబంధన వర్తిస్తుందని సీతారామన్‌ చెప్పారు. మంత్రి సీతారామన్‌ ప్రకటన చేయగానే.. మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. అయితే ఎటువంటి మినహాయింపు లేకుండా కంపెనీలు పన్ను 22శాతం కట్టేందుకు ఐటీ చట్టాన్ని మార్చనున్నట్లు మంత్రి తెలిపారు. కనీస ప్రత్యామ్నాయ పన్నును (మ్యాట్‌)ను ఎత్తివేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాంటి కంపెనీలు 25.17 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ ఒకటవ తేదీ నుంచి ప్రారంభంకానున్న కంపెనీలకు కేవలం 15 శాతం పన్ను విధించనున్నట్లు ఆమె తెలిపారు. ఇదిలాఉంటే కార్పొరేట్‌ పన్ను రేట్ల తగ్గింపుతో కేంద్రానికి ఏటా రూ 1.45 లక్షల కోట్ల ఆదాయం గండిపడుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో జోరు పెంచేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీతారామన్‌ అన్నారు. ఉత్పత్తి రంగంలోకి పెట్టుబడులను ముమ్మరం చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1,921.15 పాయింట్లు లాభపడి 38,014.62 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 569.40 పాయింట్లు లాభపడి 11,274.20 పాయింట్ల వద్ద ముగిసింది. గడిచిన పదేళ్లలో నిఫ్టీ ఈ తరహాలో సింగిల్‌ సెషన్‌ లో లాభాలు పొందలేదు. మార్కెట్లు ఈ స్థాయిలో పుంజుకోవడంతో ఒకే సెషన్‌ లో మదుపరులు రూ.6 లక్షల కోట్లు వెనకేసుకున్నారు. టాప్‌ గెయినర్స్‌ విషయానికి వస్తే ఐషర్‌ మోటార్స్‌ +13.38 శాతం, హీరో మోటో +13.06 శాతం, ఇండస్‌ ఇండ్‌ +10.71 శాతం, హింద్‌ పెట్రోల్‌+10.46%, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ +10.43% లాభపడ్డాయి. సెక్టార్‌ పరంగా చూస్తే బ్యాంకింగ్‌ సెక్టార్‌ దూసుకెళ్లింది. ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్‌ 2223 పాయింట్లు లాభపడింది. ముఖ్యంగా ఆర్‌ బీఎల్‌ బ్యాంక్‌ ఏకంగా 15.31 శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 7.99 శాతం లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 8.95 శాతం లాభఫడింది.

ఒకేఒక్క గంటలో రూ.5లక్షల కోట్లు పెరిగిన సంపద

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చేసిన ప్రకటనతో దలాల్‌ స్ట్రీట్‌కు దీపావళి పండగ ముందే వచ్చేసినట్లుంది. కార్పొరేట్‌ రంగానికి పన్నుల విషయంలో ఊరట కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం తెలిపారు. దీంతో దేశీయ మార్కెట్లలో లాభాల మోత మోగింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ.5లక్షల కోట్ల పైనే పెరిగింది. గురువారం నాటి ముగింపు ప్రకారం.. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ మార్కెట్‌ విలువ రూ.138.54లక్షల కోట్లుగా ఉంది. అయితే దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన వెంటనే మార్కెట్లు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత సెన్సెక్స్‌ ఏకంగా 1900 పాయింట్ల పైన ఎగబాకింది. ఫలితంగా బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ. 143.45లక్షల కోట్లకు పెరిగింది. అంటే కేవలం గంట వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ.5లక్షల కోట్ల పైన పెరిగింది. అటు నిప్టీ కూడా 500పాయింట్లకుపైగా లాభంతో ట్రేడ్‌ అవుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో నిప్టీ ఒక రోజులో ఇంత భారీగా లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1778 పాయింట్ల లాభంతో 37,872 వద్ద, నిప్టీ 524 పాయింట్ల లాభంతో 11,229 వద్ద ట్రేడ్‌ అయ్యాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close