హరీష్‌, గజ్వేల్‌ నర్సారెడ్డి మధ్య రహస్య చర్చలు…

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మంత్రి హరీష్‌ రావు కాంగ్రెస్‌ పార్టీలో చేర డానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఇటీవల గజ్వెల్‌ కాంగ్రెస్‌ నాయకుడు వంటేరు ప్రతా పరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. తన మామ కేసీఆర్‌ ను ఓడించడం కోసం హరీష్‌ పనిచేస్తున్నట్లు ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణల్ని ఖండించిన హరీష్‌ దమ్ముంటే ఆధారాలతో బైటపెట్టాలని వంటేరుకు సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌ పై కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏ క్షణమైనా టీఆర్‌ఎస్‌ కుండ పగిలే అవకాశం ఉందంటూ…ఇందుకు హరీష్‌ రావే కారణమవుతారని రేవంత్‌ పేర్కొన్నారు. గత నెల 25వ తేదీన మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, గజ్వేల్‌ నర్సారెడ్డిని తీసుకుని రాత్రి 9 గంటలకు హరీష్‌ రావు ఇంటికి తీసుకెళ్లారని తెలిపారు. వీరి మధ్య దాదాపు 3 గంట పాటు చర్చలు జరిగాయని…ఆ మరుసటి రోజే నర్సారెడ్డి డిల్లీకి వెళ్లి రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారని రేవంత్‌ వెల ్లడించారు. కావాలంటే మంత్రుల నివాసాల వద్ద ఉండే సిసి కెమెరా రికార్డులను పరిశీలిస్తే ఆ రోజు హరీష్‌ నివాసానికి ఎవరెవరు వెళ్లారో తెలుస్తుందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నుండి టీఆర్‌ఎస్‌లో చేరి ఓ కార్పోరేషన్‌ పదవిలో వున్న నర్సారెడ్డి కాంగ్రెస్‌ లో చేరడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రేవంత్‌ ఆరోపించారు. ప్రస్తుతం హరీష్‌, కేసీఆర్‌ కు మధ్య సంబం ధాలు ఉప్పునిప్పులా ఉన్నాయని అన్నారు. టీఆ ర్‌ఎస్‌ పార్టీలో ప్రస్తుతం తుఫా నుకు ముందు నిశ్శబ్దం కొనసాగుతోందని రేవంత్‌ తెలిపారు.

ప్రస్తుతం వేగంతో దూసు కుపోతున్న కారు డ్రైవర్‌ న మార్చబోమని కేటీఆర్‌ ప్రజలకు చెబు తున్నారు కానీ ఆయన బావే డ్రైవర్‌ ను మార్చడానికి ప్రయత్ని స్తున్నా డంటూ రేవంత్‌ ఎద్దేవా చేశారు. తనతో రహస్య సమావేశం తర్వాత రోజే నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌ ను వీడి కాంగ్రెస్‌ లో ఎందుకు చేరారో హరీష్‌ సమాధానం చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. తన మామను ఓడించాలని హరీష్‌రావు తనను కోరాడ ంటూ సంచ లన వ్యాఖ్యలు చేసిన గజ్వెల్‌ కాం గ్రెసు నాయ కుడు వంటేరు ప్రతాప రెడ్డి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఓ ప్రైవేట్‌ చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్‌ రావుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌ రావు తనను చూసి భయపడుతున్నారని వంటేరు ప్రతాప రెడ్డి అన్నారు.

గతంలో తానూ, హరీశ్‌ రెండు సార్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నామని చెప్పారు. ప్రైవేట్‌ నంబర్‌ నుంచి కాల్‌ చేసి మాట్లాడినట్లు తాను చేసిన వ్యాఖ్యలకే కాకుండా అన్నింటికీ తగిన ఆధారాలున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోనే తమ భేటీ జరిగిందని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలు చూపిస్తానని ఆయన అన్నారు ఏ దేవుడి ముందైనా ఒట్టు వేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటూ హరీశ్‌ సిద్ధమా అని ప్రశ్నించారు.హరిశ్‌ రావు గజ్వేల్‌ జీతగాడైపో యాడని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకుడైన హరీశ్‌ రావు గ్రామంలో ఉండి..గ్రామస్థాయి నాయకుడైన తనను ఛాలెంజ్‌ చేస్తున్నాడని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడం లేదా? తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అని సూటిగా ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here