డిసెంబరు 1 నుంచి 5 వరకు  కోణార్క్‌లో సైకత శిల్పాల ప్రదర్శన

0

భువనేశ్వర్: కోణార్క్‌లో డిసెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు అంతర్జాతీయ సైకతా శిల్ప ప్రదర్శన ఏర్పాటు కానుంది. రాష్ట్ర పర్యటకశాఖ దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది. దీనికి పూరీకి చెందిన అంతర్జాతీయ సైకతాశిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. విదేశాలకు చెందిన పలువురు శిల్పులు కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. కోణార్క్‌ పరిధిలోని చంద్రభాగ తీరం దీనికి వేదిక కానుండగా పర్యటకశాఖ విస్తృత ఏర్పాట్లు ప్రారంభించింది. డిసెంబరు 1 నుంచి అయిదు రోజుల కోణార్క్‌ నృత్యోత్సవాలనూ ఆ శాఖ చేపట్టనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here