పట్టువీడిన విక్రమార్కుడు

0

నిమ్స్‌లో భట్టి దీక్ష విరమణ

  • ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
  • ఇది ప్రజాభీష్టానికి పూర్తి వ్యతిరేకం
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
  • రాహుల్‌ సూచనతో నిర్ణయం
  • నిమ్మరసం ఇప్పించి విరమించిన ఉత్తమ్‌

హైదరాబాద్‌

ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క నిమ్స్‌ ఆసుపత్రిలో చేపట్టిన ఆమరణ దీక్ష విరమించారు. భట్టికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. దీక్ష విరమించాలని ఏఐసీసీ నాయకులు భట్టికి సూచించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సూచన మేరకు భట్టి విక్రమార్క దీక్షను విరమించారు. ఇదే సందర్భంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పీసీసీ పిలుపునిచ్చింది. కాగా సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్‌ దగ్గర మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన నిరవధిక దీక్షను సోమవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంమతో పోలీసులు దీక్షను భగ్నం చేసి నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సకు నిరాకరించి ఆయన దీక్ష కొనసాగించారు. శనివారం నుంచి ఆయన ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో బీపీ, షుగర్‌ స్థాయిలు పడిపోయాయని వైద్యులు చెప్పినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పోలీసులు భట్టి దీక్షను భగ్నం చేసి నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఉదయం దీక్ష కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయన్ని అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఈనెల 8నుంచి భట్టి ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఆదివారం దీక్షా శిబిరానికి పలువురు కాంగ్రెస్‌ నేతలు, ఇతర ముఖ్యులు వచ్చి భట్టి విక్రమార్కకు సంఘీభావం ప్రకటించారు. కాగా పోలీసుల అరెస్టును నిరసిస్తూ భట్టి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ మనస్తత్వం ఉన్న సీఎంలు నలుగురుంటే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నికల సంఘాన్ని, రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. దీనిపై ప్రతిఒక్కరూ చర్చించాలన్నారు. ప్రజలు తమకు ఇష్టమైన వారిని ఎన్నుకుంటే.. పూర్తి కాలం వారు ఆ గుర్తుపైనే ఉండాలన్నారు. ఒక గుర్తువిూద గెలిచినవారిని డబ్బుతో కొనడం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇది ప్రజాభీష్టానికి పూర్తి వ్యతిరేకమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here