Featuredస్టేట్ న్యూస్

కేసీఆర్‌కు పుట్ట గతులుండవ్‌..!

  • అంతిమ విజయం ఆర్టీసీ కార్మికులదే
  • టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి

షాద్‌ నగర్‌, (ఆదాబ్‌ హైదారాబాద్‌): తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని గత ముప్పై నాలుగు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తగు విధంగా స్పందిం చకపోవడం శోచనీయమని ఈ వ్యవహారంలో అంతిమ విజయం ఆర్టీసీ కార్మికులదే అవుతుందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టిపిసిసి) రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లురవి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణంలోని సాయి రాజా ఫంక్షన్‌ హాల్లో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను పేద ఆర్టీసీ కార్మికులకు అందజేశారు. బియ్యంతో పాటు మంచి నూనె, పప్పులు, చక్కెర, తదితర నిత్యవసర వస్తువులను షాద్‌ నగర్‌ డిపోకు చెందిన సుమారు 50 మంది నిరుపేద ఆర్టీసీ కార్మికులకు డాక్టర్‌ మల్లురవి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్‌ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు నరసింహా రెడ్డి, టిపీసీసీ సభ్యులు మహమ్మద్‌ అలీ ఖాన్‌ బాబర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం, సిఐటియు తదితర ప్రజాసంఘాలు, ఆర్టీసీ జేఏసీ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్‌ వల్లురవి ప్రసంగిస్తూ ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌ అని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ తర్వాత నవంబర్‌ 5వ తేదీ వరకు ఉద్యోగంలో చేరకపోతే ఆర్టీసీ ఉండదని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్‌ కు మతిస్థిమితం లేని ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓసారి తీసేశారని మరోసారి లైఫ్‌ లైన్‌ ఇస్తున్నట్టు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ మిలియన్‌ మార్చ్‌ కార్యక్ర మంతో తెలంగాణ నూతన రాష్ట్రం సిద్ధించిందని ఇప్పుడు అలాగే మరోసారి ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం మిలియన్‌ మార్చ్‌ ద్వారా ఆర్టీసీ విజయం సాధిస్తుందని ఉద్ఘాటించారు. కార్మికులను పట్టించు కోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవని ఆయన శాపనార్థాలు పెట్టారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ప్రజల మద్దతు ఉందని కాంగ్రెస్‌ పార్టీ కూడా పేద కార్మికులను ఆయా డిపోల్లో గుర్తించి నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు అన్ని డిపోల్లో ఏర్పాటు చేసే విధంగా క షి చేస్తానని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్‌ రెడ్డి మాట్లా డుతూ.. తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్‌ దుర్మార్గపు పాలన పీడ విరగడ కావడం ఖాయమని అన్నారు. సుమారు 50 వేల మంది కుటుంబాలను రోడ్డున పడేసే శక్తి ఏ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆర్టీసీ కార్మికులు మనో నిబ్బరంతో గుండె ధైర్యంతో చేపడుతున్న సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ సమ్మెలో ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకుని అమరులు అయ్యారని వారు ఎంతో గొప్ప వారని కొనియాడారు. వారి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. త్వరలోనే కెసిఆర్‌ ప్రభుత్వానికి నూకలు చెల్లి పోతున్నాయని ఆయన అన్నారు. స్థానిక కాంగ్రెస్‌ నేత వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ కెసిఆర్‌ నియంత పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. షాద్‌ నగర్‌ డిపోలో పేద ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలిచేందుకు తనవంతు సహాయంగా రూ. 2 లక్షల విలువైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని త్వరలోనే మరికొంతమందిని గుర్తించి నిత్యావసరాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు, సిపిఎం నేత రాజు నాయక్‌, శీను నాయక్‌, డిసిసి అధ్యక్షులు నరసింహారెడ్డి, బాబర్‌ ఖాన్‌, బాలరాజుగౌడ్‌, గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌, బాదేపల్లి సిద్ధార్థ, ప్రకాష్‌ గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ యాదయ్య యాదవ్‌, కష్ణారెడ్డి, సుదర్శన్‌ గౌడ్‌, మచ్చ సుధాకర్‌ రావు, కేశంపేట శంకర్‌, కొంకళ్ళ చెన్నయ్య, పురుషోత్తం రెడ్డి, జితేందర్‌ రెడ్డి, నాగమణి, నవీన్‌ చారి, మాధవ్‌, మురళి మోహన్‌, మహమూదబేగం, మధు తదితరులు పాల్గొన్నారు

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close