Featuredస్టేట్ న్యూస్

పాఠశాల బస్సు దగ్ధం

విద్యార్థులు సురక్షితం

చాగల్లు:

పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం మీనానగరం వద్ద పెను ప్రమాదం తప్పింది. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఓప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు 25 మంది విద్యార్థులతో శుక్రవారం సాయంత్రం చాగల్లు బయలుదేరింది. విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో బస్సు ఇంజిన్‌ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును రోడ్డుపక్కన నిలిపివేసి విద్యార్థులను కిందకు దించడంతో ఘోర ప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడగా, బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగానే.. క్షణాల్లో బస్సు మొత్తం కాలిపోయింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఎస్సై విష్ణువర్థన్‌ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close