తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

0

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సైరన్‌ మోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుద చేసింది ఎన్నికల సంఘం. దీంతో రెండు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినట్లైంది. రెండు రాష్ట్రాల్లో శాసన సభ కోటాలో చెరొక ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో భాగంగా ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఈనెల 21న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేసన్లకు చివరి తేది ఈనెల 28 కాగా మార్చి 1న నామినేషన్ల పరిశీలిన మార్చ్‌ 5న నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇవ్వగా మార్చి 12న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పోలింగ్‌ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరగనుందని అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌, ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 15తో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వ్యవహారం ముగింపు పలకనుంది.

ఏపీలో మంత్రులు యనమల, నారాయణ.. శమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావు, శివకుమారిల పదవీకాలం పూర్తయ్యింది. దీంతో ఈ ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుంది. తెలంగాణ విషయానికొస్తే.. మహమూద్‌ అలీ, మహ్మద్‌ సలీం, సంతోష్‌కుమార్‌, షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల పదవీ కాలం ముగిసింది. ఈ ఐదు స్థానాలకు మార్చి 12న పోలింగ్‌ జరగనుంది. ఏపీలో ఐదు స్థానాల్లో .. ఎమ్మెల్యే సంఖ్యాబలాన్ని బట్టి టీడీపీకి నాలుగు, వైసీపీకి ఒక్క పదవి వరిస్తుంది. వైసీపీకి దక్కే ఎమ్మెల్సీని ఆ పార్టీ బీసీ నేత జంగా కృష్ణమూర్తిని వరించింది. టీడీపీ నాలుగు సీట్లను ఎవరికి కేటాయించాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఇటు తెలంగాణ విషయానికొస్తే.. టీఆర్‌ఎస్‌కు నాలుగు.. కాంగ్రెస్‌కు ఒక స్థానం దక్కే అవకాశముంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here