బిజినెస్

ఎస్‌బీఐ ఏటీఏం సేవలు.. కొత్త నిబంధన

జనవరి 1 నుంచి ఓటీపీ ఆధారిత నగదు విత్‌ డ్రా సేవలు

ఏటీఎంలలో మోసపూరిత లావాదేవీలకు చెక్‌

ఎస్‌బీఐ ఏటీఎంలకు మాత్రమే

రూ.10వేలకు మించిన లావాదేవీలకు ముంబాయి, కొత్త ఏడాది నుంచి దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. నగదు అక్రమలావాదేవీలు, ఏటీఎం మోసా లను అరికట్టేందుకు ఓటీపీ ఆధారిత క్యాష్‌ విత్‌డ్రా సేవలను తీసుకొస్తోంది. సురక్షితమైన ఏటీఎం సేవలకు అందిం చడంతోపాటు, మోసపూరిత లావాదేవీలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్‌బీఐ ట్విటర్‌లో వెల్లడించింది. అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలోనూ 2020 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. ఏటీఎం క్యాష్‌ వి త్‌డ్రాయెల్స్‌కు సంబంధించి కొత్త ఏడాదిలో ఖాతాదారులకు కొత్త సేవలను అందుబాటులోకి తీసు కువస్తోంది. బ్యాంక్‌ ఖాతా దారులు ఏటీఎం నుంచి డబ్బు ఉపసంహరణకు ప్రయత్నిస్తే.. అప్పుడు బ్యాంక్‌ అకౌంట్‌తో రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్‌ చేసినపుడు మాత్రమే డబ్బులు తీసుకోవడం వీలవుతుంది. ఈ ఓటీపీ ఏటీఎం క్యాష్‌ విత్‌డ్రా సేవలు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అందు బాటులో ఉంటాయి. అలాగే ఎస్‌బీఐ ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు తీసుకోవాలని భావిస్తే ఈ ఓటీపీ విధానం వర్తించదు. కేవలం ఎస్‌బీఐ ఏటీఎంలలో క్యాష్‌ విత్‌ డ్రాకు ప్రయత్నించినపుడు మాత్రమే ఓటీపీ వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓటీపీ ఆధారిత క్యాష్‌ విత్‌డ్రా సేవలు అన్ని ఏటీఎం లావాదేవీలకు వర్తించవు. కేవలం రూ.10,000కు పైన లావాదేవీలకు మాత్రమే ఓటీపీ వస్తుంది. ఎస్‌బీఐ ఏటీఎం నెట్‌వర్క్‌కు అంతటికీ ఓటీపీ విధానం అమలులోకి వస్తుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close