Featuredస్టేట్ న్యూస్

ఆదిలాబాద్‌ను ఆదుకోండి

ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఎంపీ సోయం బాబూరావు, కేంద్ర బీజేపీ తెలంగాణ వ్యవహారాల కోఆర్డినేటర్‌ నూనె బాల్‌ రాజ్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశ రాజ ధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మంగళవారం ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుతో పాటు కలిసి నట్లు కేంద్ర బిజెపి తెలంగాణ వ్యవహారాల కోఆర్డినేటర్‌ నూనె బాల్‌రాజ్‌ ఒక ప్రకట నలో తెలిపారు. ప్రధాన మంత్రిని కలిసిన వారిలో అదిలాబాద్‌ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్‌ శంకర్‌ తదిత రులు ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ సంద ర్భంగా వారు ఆదిలాబాద్‌ జిల్లా అభివద్ధి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినతి పత్రాన్ని అందజేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉన్న సిమెంట్‌ ఫ్యాక్టరీని పున ప్రారంభించాలని కోరారు. జిల్లా కేంద్రంలో ఎయిర్‌ పోర్టు ను ఏర్పాటు చేయాలని, అంతేగాక కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుండి ఆర్మూర్‌ వరకు రైల్వే లైన్‌ నిర్మించి జిల్లా ప్రజలకు నేరుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్లడానికి రైలు సౌక ర్యాలు కల్పించాలని కోరారు. 280 కోట్ల రూపాయల నిధులు ఆదిలాబాద్‌ జిల్లా అభివద్ధికి కేటా యించాలని కోరారు. జిల్లా కేంద్రంలో, నిర్మల్‌ జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పా టు చేయాలని, ఆదిలాబాద్‌, ముధోల్‌లో టెక్‌స్ట్టైల్స్‌ పార్కును ఏర్పాటు చేయాలని, అంతేగాక బాసర లోని సరస్వతి దేవాలయాన్ని ప్రధానమంత్రి సందర్శించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ బిజెపి జిల్లా అధ్య క్షులు పాయల్‌ శంకర్‌, నిర్మల్‌ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ పి రమాదేవి, సిర్పూర్‌ ఇన్చార్జ్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ సిడాం గణపతి, ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ రామకష్ణ, రిటైర్డ్‌ జెసి వీరమల్లు, ఆదివాసీ తుడుందెబ్బ సలహాదారులు సిడాం జంగు, స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఏ భూమయ్య పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close