కర్జత్‌ లో సాహో సందడి

0

డార్లింగ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కళ్ళల్లో కోటి దీపాలు వెలిగించుకుని మరీ ఎదురు చూస్తున్న సాహో విడుదలకు ఇంకో మూడున్నర నెలలు మాత్రమే టైం ఉంది. ఇప్పటికీ షూటింగ్‌ సాగుతూనే ఉన్నప్పటికీ ముందు ప్రకటించిన ఆగస్ట్‌ 15 సాహో రిలీజవుతుందన్న నమ్మకంతో ట్రేడ్‌ సైతం దానికి తగ్గట్టు రెడీ అవుతోంది. ప్రస్తుతం సాహో టీమ్‌ మహారాష్ట్రలోని కర్జత్‌ ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఈ విషయాన్నీ ధ వీకరిస్తూ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ తన ఇన్స్‌ టాగ్రామ్‌ లో చిన్న వీడియో పోస్ట్‌ చేయడంతో దీని గురించి క్లారిటీ వచ్చింది. అక్కడ కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్‌ ఒకటి షూట్‌ చేస్తున్నట్టు సమాచారం. ఒకపక్క బాలన్స్‌ పార్ట్‌ పూర్తి చేసుకుంటూనే మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ మొదలుపెట్టేసిన సాహో టీమ్‌ డెడ్‌ లైన్‌ మీట్‌ అయ్యేందుకు చాలా కష్టపడుతోంది

సుమారు 200 కోట్ల దాకా బడ్జెట్‌ తో రూపొందుతున్న సాహో మూవీ బాహుబలి 2 తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తో వస్తోంది. బిజినెస్‌ పరంగా ఇప్పటికే అన్ని రకాల బాషల నుంచి విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఈ సినిమా కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమనే ధీమాతో ఫాన్స్‌ ఉన్నారు.

షేడ్స్‌ అఫ్‌ సాహో పేరుతో ఇప్పటిదాకా రెండు వీడియోలు వదిలింది టీమ్‌. టీజర్‌ కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. దాని కోసమైతే ఇంకో నెలకు పైగానే వెయిటింగ్‌ తప్పేలా లేదు. శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ సంగీతం అందిస్తున్న సాహో ద్వారా శ్రద్ధా కపూర్‌ సౌత్‌ కు పరిచయమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here