ఇంటర్‌ బోర్డు తప్పిదాలపై సర్కార్‌ నిర్లిప్తత

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో ఇంటర్‌ విద్యా భ్రష్టు పట్టింది. తాజాగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలకు విద్యార్థులు బలయ్యారు. వేలాదిగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినా ప్రబు/-వం కిమ్మనడం లేదు. విద్యాశాఖ మంత్రి ఎవరికీ అన్యయం జరగదని చేతులు దులుపుకున్నారు. అలసలు బోర్డులో ఏం జరుగుతుందో అన్న ఆందోళన కలుగుతోంది. సున్నా మార్కుఉల రావడం..రీ కౌంటింగ్‌ నిర్వహిస్తే 99 మార్కులు రావడం లాంటి ఉదాహరణలు బయటకు వచ్చాయి. ఇలాంటి అక్కమాలు మరెన్ని జరిగాయో తెలియదు. బోర్డు వైఫల్యాలకు టిఆర్‌ఎస్‌ సర్కార్‌ సిగ్గుతో తలదించుకోవాలి. ఇంటర్మీ డియట్‌ పరీక్ష ఫలితాల విషయంలో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరుగనీయబోమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేసినా, జరిగిన నష్టానికి ఏం చేయబోతున్నారో చెప్పలేదు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించి తప్పును కప్పిపుచ్చుకునే ప్రకటన చేశారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా సరిదిద్దుతామని మంత్రి చెప్పి అందుకు కారణాలను అన్వేషించడంలో విఫలం అయ్యారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులతో మంత్రి జగదీశ్‌రెడ్డి సవిూక్షించారు. కొందరు అధికారులు అంతర్గత తగాదాలతో ఈ అపోహలు సృష్టించినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపి చేతులు దులుపుకున్నారు. తపపు చేసిన వారికి శిక్ష పడుఉతందన్న భయం లేకుండా చేశారు. ఫలితాల సమయంలో చోటుచేసుకున్న అపోహలను తొలిగించడానికి తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ వేసినట్టు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీ సత్వరమే దర్యాప్తుచేసి, మూడురోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కమిటీలో వెంకటేశ్వర్‌రావుతోపాటు హైదరాబాద్‌ బిట్స్‌ ప్రొఫెసర్‌ వాసన్‌, ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ నిశాంత్‌ సభ్యులుగా ఉంటారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రొఫెసర్‌ వాసన్‌కు ఐటీ విూద స్పష్టమైన అవగాహన ఉందని, ప్రొఫెసర్‌ నిశాంత్‌ పోటీపరీక్షల నిర్వహణలో నిపుణుడని పేర్కొన్నారు. మరోవైపు ఇంత జరుగుతున్నా పరీక్షలపై వస్తున్న ఆరోపణల్లో, జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్శర్శి అశోక్‌ ప్రకటన చేయడం సిగ్గుచేటు కాక మరోటి కాదు. అవకతవకలు జరుగడానికి ఆస్కారమే లేదని స్పష్టం చేసిన పెద్దాయన ఎందుకిలా జరిగిందో చెప్పలేక పోయారు. ఇంటర్‌ వార్షిక ఫలితాల్లో.. పరీక్ష రాయకపోయినా పాస్‌ అయ్యారనేది అవాస్తవమని తెలిపారు. 21 వేల మంది విద్యార్థుల వివరాలు గల్లంతు అయినట్లుగా జరుగుతున్న ప్రచారం నిరాధారమని పేర్కొన్నారు. ఏ ఒక్క విద్యార్థి సమాచారం కూడా గల్లంతు కాలేదని, పూర్తి భద్రతతో బోర్డు వద్ద ఉందని స్పష్టం చేశారు. జవాబు పత్రాలను అర్హత లేని వారితో మూల్యాంకనం చేయించారని అనడం సరికాదని, ప్రతి సంవత్సరంలాగే అర్హత కలిగిన అధ్యాపకుల ద్వారా మాత్రమే మూల్యాంకనం చేయించామని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరుగ కుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కెటిఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇన్నఅనర్థాలకు కారకులను మాత్రం వెనకేసుకుని వచ్చిన గనత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here