శామ్‌¬సంగ్‌ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం

0

విశాఖపట్నం : తమ ఫ్లాగ్‌¬షిప్‌ స్మార్ట్‌¬ఫోన్ల శ్రేణిలో ఇటీవలే తాను విడుదల చేసిన గెలాక్సీ ఎస్‌10 శ్రేణికిగాను శామ్‌¬సంగ్‌ ఇండియాకు అద్భుతమైన ప్రతిస్పందన లభించింది. దీనితో, ప్రీమియం సెగ్మెంట్‌ (రూ. 30,000 కన్నా ఎక్కువ) భారతదేశపు నెంబర్‌ 1 స్మార్ట్‌¬ఫోన్‌ కంపెనీ అయిన శామ్‌¬సంగ్‌, గెలాక్సీ ఎస్‌¬10 శ్రేణి భారీ విక్రయాలతో, తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. షిప్‌¬మెంట్లను కాక రీటెయిల్‌ విక్రయాలను గణనలోకి తీసుకునే జిఎఫ్‌¬కె నుండి లభించిన డాటాను అనుసరించి, శామ్‌¬సంగ్‌, మార్చ్‌ నెలలో రూ. 30,000 ధర కన్నా ఎక్కువ వర్గంలో 76.5 శాతం మార్కెట్‌ పరిమాణాన్ని మరియు 77 శాతం మార్కెట్‌ విలువ వాటాను కలిగి ఉన్నాయి. మార్చ్‌ నెలలో ప్రీమియం వర్గంలో అమ్ముడుపోయిన ప్రతి నాలుగు స్మార్ట్‌¬ఫోన్లలో మూడు, గెలాక్సీ ఎస్‌¬10 స్మార్ట్‌¬ఫోన్‌¬లే. గెలాక్సీ ఎస్‌10, 2019 జనవరి నుండి మార్చ్‌ త్రైమాసకాలం (క్యూ1)లో శామ్‌¬సంగ్‌, మార్కెట్లో తన అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు కూడా సహకరించింది. జిఎఫ్‌¬కె గణాంకాలను అనుసరించి 2019 తొలి త్రైమాసకాలంలో మార్కెట్‌ పరిమాణంలో 68.9 శాతాన్ని, మార్కెట్‌ విలువలో 65.9 శాతం వాటాను శామ్‌¬సంగ్‌ కలిగి ఉన్నది. ”గెలాక్సీ ఎస్‌10తో మేము వినియోగదారులకు, వారి రోజువారీ అవసరాలకు అతికినట్లు సరిపోయే విధంగా రూపొందించిన ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించాము. గెలాక్సీ ఎస్‌10, పరిశ్రమలో మొదటిసారి అందుబాటులోకి తెచ్చిన ఫీచర్లను మా వినియోగదారులు చక్కగా స్వాగతించారు, ప్రీమియం వర్గంలో మేము మా నెంబర్‌ 1 స్థానాన్ని పటిష్టం చేసుకోవటం ఆశ్చర్యం కలిగించలేదు. శామ్‌¬సంగ్‌ అభిమానులందరికీ నేను ధన్యవాదాలు తెలియచేయదలుచుకున్నాను. మీ అభిప్రాయాలను తెలుసుకుంటూ మీకు ఆహ్లాదాన్ని కలిగించటం మేము కొనసాగిస్తాము,”అనిఆదిత్య బబ్బర్‌, శామ్‌¬సంగ్‌ ఇండియా¬లో డైరెక్టర్‌ (మొబైల్‌ బిజినెస్‌) చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here