Featuredస్టేట్ న్యూస్

సమ్మెకాలపు జీతాలు చెల్లించాలి

  • ఆర్టీసీని ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారు
  • డ్యూటీ రిలీఫ్‌పై కార్మికశాఖ కమిషనర్‌ స్పందించాలి
  • కేవలం హక్కుల కోసమే యూనియన్లు లేవు
  • అవసరమైతే యూనియన్ల నేతలంతా విధుల్లోకి వెళ్తాం
  • తక్షణమే కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలి
  • ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్‌

కార్మికులకు సమ్మెకాలపు జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కార్మిక సంఘాల నేతల డ్యూటీ రిలీఫ్‌ తొలగించడం చిల్లర చర్య అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. చట్ట ప్రకారం కార్మిక నేతలకు కొన్ని మినహాయింపులుంటాయని, కార్మిక సంఘాలకు కల్పించే డ్యూటీ రిలీఫ్‌పై కార్మిక శాఖ కమిషనర్‌ స్పందించాలని కోరారు. కేవలం హక్కుల కోసమే యూనియన్లు లేవని, అవసరమైతే యూనియన్ల నేతలంతా విధుల్లోకి వెళతామన్నారు. ఆర్టీసీని అధికారులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని, తక్షణమే కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్టీసీలో చరిత్రలో ఇది ఓచారిత్రక సమ్మెఅని అన్నారు. కార్మికుల జీతాలు చెల్లించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వర్తింపచేయాలని, కార్మికుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరుతున్నామని తెలిపారు. యూనియన్లు ఉండాలా? లేదా?అన్నది లేబర్‌ కోర్టు తేలుస్తుందని తెలిపారు. దశాబ్దాల కాలంగా ట్రేడ్‌ యూనియన్లు ఉన్నాయని, కార్మిక సంఘాలతో పాటు అనేక సంఘాలు తెలంగాణ పోరాటంలో ముందున్నాయియూనియన్ల నుంచి తొలగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్మికులతో రెఫరెండం పెట్టి.. యూనియన్లు ఉండాలా? వద్దా? తేల్చండని అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు రవాణాను కాపాడేందుకే తమతో కలిసి పోరాడాయని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోమని చెప్పడం సంతోషదాయకమని అశ్వత్థామరెడ్డి తెలిపారు. బకాయిలు చెల్లించాలని కోరామని, కార్మికుల సమస్యలపై లేబర్‌ కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. సమ్మె సమయంలో 31మంది చనిపోవడం చాలా బాధించిదని, వారి కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్‌ జీతాలు వెంటనే ఇవ్వాలని కోరుతున్నట్లు ఐకాస కో-కన్వీనర్‌ రాజిరెడ్డి తెలిపారు. యూనియన్లను రద్దు చేసే హక్కు ఎవరికీ లేదని, తెలంగాణ ఉద్యమంలో యూనియన్లు కీలకంగా పని చేశాయని గుర్తు చేశారు. యూనియన్ల వల్ల నష్టం వస్తోందని భావిస్తే.. సరిదిద్దుకుంటామన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close