సైనాకు షాక్‌

0

ఆక్లాండ్‌: భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు న్యూజిలాండ్‌ ఓపెన్‌లో షాక్‌ తగిలింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో వరల్డ్‌ నంబరు 212వ ర్యాంక్‌ క్రీడాకారణి వాంగ్‌ జియి చేతిలో సైనా ఘోర పరాజయం చవిచూసింది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 16-21, 23-21, 4-21తో సైనా ఓడిపోయింది. తొలి గేమ్‌లోనే 19ఏళ్ల వాంగ్‌ జియి సైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 21-16తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ జియి అదే దూకుడు ప్రదర్శించినప్పటికీ.. సైనా తిరిగి పుంజుకుంది. ఒక దశలో 19-19 పాయింట్లతో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఆ తర్వాత సైనా నాలుగు పాయింట్లు సాధించి రెండో గేమ్‌లో విజయం సాధించింది. అయితే గెలుపును నిర్ణయించే మూడో గేమ్‌లో సైనా మళ్లీ తేలిపోయింది. జియి జోరును అడ్డుకోలేకపోయింది. ఈ గేమ్‌లో సైనా కేవలం 4 పాయింట్లే సాధించింది. దీంతో 2-1తో జియు విజయం సాధించింది. ఫలితంగా న్యూజిలాండ్‌ ఓపెన్‌ నుంచి సైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here