సురక్షిత దేశమేది?

0

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశం ఏది అంటే? ఠక్కున అమెరికా వంటి దేశాల పేర్లు చెబుతారు. కానీ కాదు. ప్రపంచంలోని దేశాల్లో అత్యంత సురక్షితమైన దేశం ఐస్‌ల్యాండ్‌. ఒక్కసారి కాదు వరుసగా ఏడోసారి సురక్షిత దేశంగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నది. ఈ ఘనత సాధించడం ఐస్‌ల్యాండ్‌కు పదకొండవ సారి. ఓ ఆస్ట్రేలియన్‌ అధ్యయన సంస్థ ప్రపంచ దేశాల్లో ఉన్న స్థితిగతులు, అక్కడి ప్రభుత్వాల పాలన, పర్యావరణ పరిస్థితులు, ఇతర విషయాలను, విశేషాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను విడుదల చేసింది. తక్కవ క్రైమ్‌ రేటు, ఉగ్రవాదులదాడులు, హత్యలు, ఆయుధాల వ్యాపారం, అమ్మకాలు, వినియోగం, అవినీతి ఇలాంటివి ఏవీ అక్కడ కనిపించవు. 3.40 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో మిలటరీ వ్యవస్థ కూడా ఉండదు. ఆ అవసరమే రాదంటున్నారు అక్కడి వాస్తవ్యులు. ఇలాంటి ప్రత్యేకతలు ఉండడం వల్ల అది సురక్షిత దేశంగా మనగలుగుతుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకం కూడా పెరుగుతున్నది. దీనివల్ల కొంత పర్యావరణానికి నష్టం ఉండే ప్రమాదమని తెలిసి పరిమితంగా పర్యాటకులను అనుమతిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here