శబరిమల వివాదం.. దేవుడికి వెన్నుపోటు

0

అనంచిన్ని వెంకటేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌

మనిషిని మనిషి వెన్నుపోటు పొడవటం అందరికీ తెలుసు. నమ్మిచ్చి తడిగుట్టతో గొంతుకోయడంలో మనిషి నిష్ణాతులైనాడు. అయితే దేవుడికి మనిషి వెన్నుపోటు పొడవటం ఇదే తొలిసారి కావచ్చు. హిందూ భక్తుల విశ్వాసాలను పరిరక్షణ ముసుగులో ఏకంగా తన సిద్దాంతాలను ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు అడ్డంగా అడ్డం తిరిగింది. ఈ నిర్ణయంపై కేరళతోపాటు దేశం యావత్తు ఒక్కసారిగా నివ్వెరపోయింది.

ఇదీ విషయం:

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై ట్రావెన్కోర్‌ దేవస్థానం బోర్డు యూటర్న్‌ తీసుకున్నది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి వెళ్లవచ్చు అని బోర్డు సుప్రీం ముందు తెలిపింది. బోర్డు ఏదైనా నిర్ణయాన్ని మార్చుకున్నదా అని జస్టిస్‌ ఇందూ మల్హోత్రా అడిగారు. దానికి బోర్డు కౌన్సిల్‌ రాకేశ్‌ ద్వివేదీ సమాధానం ఇచ్చారు. మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పును గౌరవిస్తామని, ఈ విషయమైన పిటిషన్‌ వేశామని, మహిళల ప్రవేశంపై తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని బోర్డు వెల్లడించింది. కానీ శబరిమల ఆలయ ప్రధాన పూజారి మాత్రం బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇటీవల ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్న తర్వాత… ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేసిన విషయం తెలిసిందే. అన్ని వయసుల మహిళలు అయ్యప్పను దర్శించుకోవచ్చు అని గత ఏడాది సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత.. కేరళలో ఆందోళనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సుప్రీం తీర్పుకు వ్యతిరేకం మొత్తం 65 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇటీవల కనకదుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు. జీవవైవిధ్య కారణాల వల్ల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోలేమని ఇవాళ ట్రావెన్కోర్టు బోర్డు కోర్టు ముందు వెల్లడించింది. సమానత్వం అనేది రాజ్యాంగ నియమం అని పేర్కొన్నారు. అయితే ఇవాళ్టి పిటిషన్లపై తీర్పును రిజర్వ్లో ఉంచుతున్నట్లు కోర్టు పేర్కొన్నది.

ఇదే విషయం ఇతర మతస్థులకూ…:

సుప్రీంకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయిన తరుణంలో ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం యు టర్న్‌ తీసుకోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇదే తీర్పును ఇతర మత విషయాలకు విస్తరింపజేయగలరా’ అని హిందూ ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. హిందూ దేశంలో హిందువులకు, హిందూ ధర్మానికి విలువలేకుండా పోయిందని వారు వాపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here