కేరళలో ఆగని శబరి ఆందోళనలు

0

తిరువనంతపురం : శబరిమల వివాదంపై కేరళలో మొదలైన ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. మంగళవారం తెల్లవారుజామున కొజికోడ్‌ జిల్లాలో సీపీఎం, బీజేపీ నాయకుల ఇళ్లపై దుండగులు నాటు బాంబులు విసిరారు. సీపీఎం కోయిలాండీ కమిటీ సభ్యుడు షిజు ఇంటిపై తొలుత దాడి జరగ్గా… కొద్దిసేపటికి ఇదే ప్రాంతంలోని బీజేపీ నేత వీకే ముకుంద ఇంటిపైనా నాటుబాంబులు పడ్డాయి. అయితే ఈ రెండు ఘటనల్లోనూ ఎవరికీ ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. కాగా సోమవారం కూడా కోయిలాండే బీజేపీ నేత ఇంటిపై దుండగులు నాటుబాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు కాన్నూర్‌లో 18 నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారు. గత బుధవారం 40 యేళ్ల ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించడంపై వారం రోజులుగా కేరళలో ఆందోళనలు వెల్లువెత్తాయి. మరుసటి రోజున పలు హిందూత్వ సంస్థలు కేరళ వ్యాప్తంగా బంద్‌ చేపట్టాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైన వారిపై 2,187 కేసులు నమోదు కాగా… 6,914 మందిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here