Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆర్డబ్ల్యూఎస్ డిఇ శ్రీనివాస్

తాండూర్( ఆదాబ్ హైదరాబాద్) వికారాబాద్ జిల్లా తాండూరులో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. తాండూర్ ఆర్డబ్ల్యూఎస్ డి గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మంగళవారం 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మిషన్ భగీరథ కాంట్రాక్టర్ గురువయ్య బషిరాబాద్ మండలంలో 69 లక్షల రూపాయలతో పైపులైన్ పనులు పూర్తి చేశాడు.అయితే తనకు రావలసిన బిల్లుల కోసం సంబంధిత ఆర్డబ్లుఎస్ డిఈ మరియు వర్కింగ్ స్పెక్టర్ మహేందర్ ను పలుసార్లు బిల్లు చేయాలంటూ కార్యాలయం చుట్టూ తిరిగాడు. తనకు లంచంగా రూ ,50 వేలు  చెల్లించాలంటూ మొండికేశాడు డీఈ శ్రీనివాస్ .అయితే గత పదిహేను రోజుల క్రితం కాంట్రాక్టర్ గురువయ్య డిఈ కి 20 వేల రూపాయలు చెల్లించాడు .మిగతా 30 వేలు ఇస్తేగాని బిల్లులు  చేయనంటూ   డిఈ వేధించడంతో గురువయ్య ఎసిబి అధికారులకు  సంప్రదించాడు .దీంతో ఎసిబి డిఎస్పీ సూర్యనారాయణ నేడు తన సిబ్బందితో కలిసి e వల పన్ని  రూ ,30 వేలు డిఈ శ్రీనివాస్ కు ఇస్తుండగా  పట్టుకున్నారు .అందుకు సహకరించిన వర్కస్పెక్టర్ మహేందర్ ను కూడా అదుపులోకి తీసుకున్నామనికేసు నమోదు చేసుకుని  విచారణ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close