Featuredస్టేట్ న్యూస్

కేసీఆర్‌ నియంతత్వం, దొర పోకడలతోనే ఆర్టీసీ సమ్మె

డెడ్‌ లైన్లతో కేసీఆర్‌ సమ్మె నిర్వీర్యం కుట్ర ఫలించలేదు..

కేసీఆర్‌ విధానాలకు నిరసిస్తున్న తెలంగాణ ప్రవాసులు..

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమ్‌ కుమార్‌..

రామచంద్రాపురం(ఆదాబ్‌ హైదరాబాద్‌):

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతత్వం, దొర పోకడలే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ్‌ కుమార్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని భేల్‌ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు.కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ పార్లమెంట్‌ ఇంచార్జ్‌ గాలి అనిల్‌ కుమార్‌ ఆర్టీసీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన బియ్యం, నిత్యవసర సరకులను కుసుమ్‌ కుమార్‌ కార్మికు లకు అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న నిరంకుశ విధానా లను రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని తెలంగాణ ప్రజలం దరూ నిరసిస్తున్నారని విమర్శించారు.ఇటీవల అమెరికా లోని వాషింగ్టన్‌డిసిలో పర్యటించిన టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ను కార్యక్రమంలో మాట్లాడనివ్వకుండా కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిన దించి తెలంగాణ ప్రవా సులు అడ్డుకున్నారని తెలి పారు. దీంతో వినోద్‌ వేదిక దిగి వెళ్లిపో వాల్సిన పరిస్థితి ఏర్పడిం దన్నారు. తెలం గాణ ఉద్యమంలో అన్నివి ధాలుగా తోడ్పాటు నందించిన తెలంగాణ ప్రవాసులు కేసీఆర్‌ విధానాలను వ్యతిరే కిస్తున్నారని చెప్పారు. విభ జించు పాలించు అనే బ్రిటీష్‌ వారి పాలసీ మాదిరిగా సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులను భయపెట్టి, వారి ని విడదీసి డెడ్‌ లైన్లతో సమ్మె నిర్వీ ర్యానికి చేసిన కుట్ర ఫలిం చలేదని ఎద్దవ చేశారు. ఆర్టీసీ సంస్థకు చెందిన వేలకోట్ల ఆస్తులపై కన్నేసిన కేసీఆర్‌ ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాలుగా అండగా నిలు స్తుందని కుసుమ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కార్య క్రమంలో కాం గ్రస్‌ నాయకులు ఎం.సపాన దేవ్‌, గోదావరి అంజిరెడ్డి, సమీర్‌, మవీన్‌గౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, హబీబ్‌జానీ, శ్యామ్‌రావు, పాల్గొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close