సినిమా వార్తలు

రౌడీ దేవరకొండ ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో

టాలీవుడ్‌ లో మోస్ట్‌ బ్యాచిలర్‌ ఎలిజి బుల్స్‌ జాబితా తిరగేస్తే అందులో ప్రభాస్‌ పేరు ముందు వరుసలో ఉం టుంది. ఆ తర్వాత ఆంజనేయ భక్తుడు నితిన్‌ పేరు జాబితాలో చేరింది. ఇంకా కొందరు బ్యాచిలర్స్‌ పెళ్లి పేరెత్తకుండా సైలెంటుగా సినిమాలు చేసుకుంటు న్నారు. వీళ్లతో పాటే రౌడీ దేవరకొండ సైతం పెళ్లంటే ఆమడ దూరం అనేస్తుండడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌. చూద్దాం.. చేద్దాం! అనే కన్ఫ్యూజన్‌ లోనే ఉన్నాడు దేవరకొండ. కేవలం కెరీర్‌ పైనే దష్టి సారిస్తుండడంతో వ్యక్తిగత జీవితంపై అంతగా శ్రద్ధ తీసుకునే సమయమే చిక్కడం లేదా? అంటూ ఫ్యాన్స్‌ డౌట్‌ వ్యక్తం చేస్తు న్నారు. ఇంతకీ మీరు ఎవరినైనా ప్రేమించారా? పిల్లను సెలక్ట్‌ చేసుకు న్నారా? అంటే కొందరున్నారు… చూద్దాం ఎవరితో అవుతుందో అన్నాడు దేవరకొండ. ప్రస్తుతం ఇంట్లో అమ్మ – నాన్న.. అమ్మమ్మ అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు. గ్రూప్‌ డిస్కషన్స్‌ నడుస్తున్నాయి… ఆడాళ్లంటే పెళ్లి గురించే తొందర.. అని ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీనిని బట్టి దేవరకొండపై పెళ్లి గురించిన ప్రెజర్‌ పెరుగుతోందని అర్థమవుతోంది. రెండు మూడేళ్లలో పెళ్లాడేయాలి. అటుపై పిల్లల్ని కనాలి అని అమ్మ అడిగిందని తాజా ఇంటర్వ్యూలో దేవరకొండ తెలిపాడు. అయితే ఎప్పుడో పుట్టే వాడి కోసం నేను పెళ్లాడాలా? పిల్లాడి కోసం పెళ్లా? నాకు ఫీలింగ్‌ కలిగితే చేసుకుంటాను. కానీ ఇప్పట్లో పెళ్లి ఆలోచన అయితే లేదు.. అంటూ కన్‌ క్లూజన్‌ ఇవ్వడం చూస్తుంటే దేవరకొండ మరో రెండేళ్లలో మామ్‌ – డాడ్‌ కోరిక తీరుస్తాడా లేదా? అన్న సందిగ్ధత కనిపిస్తోంది. ప్రభాస్‌ తర్వాత దేవరకొండ కూడా అదే బాటలో లేట్‌ చేస్తున్నాడా? నిన్ననే బార్డర్‌ లోకి వచ్చాడు. 30వ బర్త్‌ డే జరుపు కున్నాడు. ఇక ఈ ఏజ్‌ దాటితే ముదురు బ్రహ్మచారుల జాబితాలో కలిపేస్తారు. అటుపై పిల్లని ఇవ్వాలన్నా పేరెంట్‌ సందేహించడం గ్యారెంటీ. అయితే దేవరకొండను పెళ్లాడాలని కలలుగనే మగువల మాటేమిటి? నిండా ప్రేమలో మునిగి తనపైనే క్రష్‌ అంటూ వేరే లోకంలో బతికేసే గాళ్స్‌ పరిస్థితేంటి? అన్నది ఆ పైవాడికే తెలియాలి. ఇకపోతే బర్త్‌ డే రోజు దేవరకొండ ఎందుకు ఐస్‌ క్రీమ్‌ లు పంచుతాడు? అంటే దానికి అతడి నుంచి వచ్చిన సమాధానం ఆసక్తికరం. చిన్నప్పుడు బర్త్‌ డే అంటే ఫ్రెండ్స్‌ అందరికీ చాక్లెట్లు పంచేవాళ్లం. ఇప్పుడు కూడా మనవాళ్లు ఎందరో ఉన్నారు. అందరికీ ఐస్‌ క్రీమ్‌ లు పంచితే బావుంటుందనిపించి ప్రతి బర్త్‌ డేకి ఇలా ప్లాన్‌ చేశానని తెలిపారు దేవరకొండ. స్టార్‌ డమ్‌ ప్రస్థావన తెస్తే.. నాకు నచ్చిందే చేస్తున్నాను. అది అందరికీ నచ్చుతోంది. నాకు నచ్చనిది బలవంతంగా చేయమన్నా చేయను అని తెలిపాడు ఇంట్రెస్టింగ్‌ కొండ.దేవరకొండ ఇచ్చిన హింట్‌ ని బట్టి రెండు మూడేళ్ల తర్వాత పెళ్లి అంటే 2021 లేదా 2022లో పెళ్లాడేస్తాడేమో.. అంటూ ఫ్యాన్స్‌ లో చర్చ సాగుతోంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close