గులాబీ గుబాళించాలి..

0
 • ఢిల్లీ మెడలను ప్రజలు వంచాలి..
 • భారత్‌పైనే కేసీఆర్‌ దృష్టి…
 • సంక్షేమ పథకాలు కాపీ
 • సన్నాహక సమావేశంలో కేటీఆర్‌

ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చొవాలో టీఆర్‌ఎస్‌ నిర్ణయించే స్థాయికి ఎదగాలని…లోక్‌ సభ ఎన్నికల్లో ఎంఐఎం ఒక్క సీటు కలుపుకుని మొత్తం 17 ఎంపీ స్థానాలను గెలిపిస్తేనే అది సాధ్యమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడించారు. లోక్‌ సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అందులో భాగంగా జిల్లాల వారీగా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల్లో జరిగే సభలకు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై నేతలు, కార్యకర్తలకు దిశా..నిర్దేశం చేస్తున్నారు. గురువారం వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ఐదు లక్షల ఓట్లతో ఎంపీని గెలిపించి వరంగల్‌ జిల్లాలో గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

వరంగల్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. గురువారం వరంగల్‌ లోని ఓ సిటీ మైదానంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ అధ్యక్షతన జరిగిన టిఆర్‌ఎస్‌ వరంగల్‌ పార్లమెంట్‌ స్థాయి సన్నాహక సమావేశానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై లోక్‌సభ ఎన్నికలపై వరంగల్‌లోని ఏడు నియోజకవర్గాల నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సమాయత్త సభలను నిర్వహిస్తున్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు బైక్‌ ర్యాలీలతో అట్టహాసంగా ఘన స్వాగతం పలికారు ఓరుగల్లు గులాబీ దండు. ఓరుగల్లు మొత్తం ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైనట్టు గులాబీ మయంగా మారింది. ఓరుగల్లు పార్లమెంట్‌ నియోజకవర్గంలో 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైనా ఉంది అని అన్నారు. భారతదేశంలోని రాజకీయ వ్యవస్థ మొత్తం దష్టి కేసీఆర్‌ పైనే ఉంది అని రాజకీయ ప్రత్యర్ధులు సైతం చెప్తున్నారన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదని, సీఎం కేసీఆర్‌ గొప్ప పరిపాలనాదక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని కొనియాడారు. స్వతంత్రం వచ్చి 71 ఏళ్లు గడిచినప్పటికీ తెలంగాణ గురించి, రైతుల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఐదేళ్ల టిఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రైతుబంధు, 24 గంటల కరెంటు, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్‌, కేసీఆర్‌ కిట్లు, మౌలిక వసతుల కల్పన మొదలైన పథకాలు దేశానికే రోల్‌ మోడల్‌ గా నిలిచాయని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు ఉద్యమాలకు ఊతమి చ్చిన వరంగల్‌ జిల్లా అంటే ఎంతో ఇష్టమని ఆయన అన్నారు. కేంద్రంలో 16 మంది ఎంపీలు తెలంగాణ నుండి ఉంటే ప్రధానిగా ఎవరిని నియమించాలో నిర్ణయించే సత్తా తమకే ఉంటుందని ఆయన అన్నారు. కేంద్రంలో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలక భూమిక పోషించబోతున్నట్లు గా ఆయన జోస్యం చెప్పారు. 2014లో తెలంగాణ ప్రజలు మోదీ గుజరాత్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధంగా దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు అనే భ్రమలో బిజెపిని అఖండ మెజార్టీతో గెలిపించారని, కానీ ఐదేళ్ల పాలనలో ప్రధానిగా నరేంద్ర మోడీ దేశానికి చేసిన మంచి ఏవిూ లేదని, అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన ఎన్నికలలో బిజెపి ఘోరంగా ఓటమి పాలు కావడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దాను ఇవ్వమని సీఎం కేసీఆర్‌ అడుగుతే ప్రధాని ఇవ్వలేదని విమర్శించారు. రైతుబంధు పథకాన్ని ప్రధాని ,పక్క రాష్ట్ర సీఎం కాపీ కొట్టి ఇతర పేర్లు పెట్టి అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు దేవాదుల నుండి 100 టీఎంసీల నీరు అందనుందని, తద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జిల్లా మొత్తం సస్యశ్యామలం కాబోతుందని ఆయన అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాలుగా తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో బూతుల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎంపీ ఎన్నికల తర్వాత వచ్చే జడ్‌ పి టి సి, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా గెలిచే విధంగా తీవ్రంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఓటర్లు అందరూ తమ వాళ్లేనని, అందరినీ ఓట్లు అడగాలని, వ్యతిరేకులను కూడా తమ వైపు తిప్పుకోవాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌, బిజెపి ,టిడిపి పార్టీలు ఎప్పటికైనా పరాయి పార్టీలేనని, ఎన్నికలలో కాంగ్రెస్‌ కు ఓటు వేస్తే మోరి లో వేసినట్లేనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ వాళ్లను గెలిపిస్తే బాత్రూంకి వెళ్లాలన్న ఢిల్లీ నాయకులను అడగాల్సి వస్తుంది అని ఎద్దేవా చేశారు. అందరూ కష్టపడి పనిచేసి వరంగల్‌ ఎంపీ సీటును ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

రైతు సంక్షేమంకోసం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను అటు బీజేపీ, ఇటు రాజకీయంగా బద్ధ శత్రువుగా భావించే టీడీపీ సైతం ఫాలో చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్‌ సంక్షేమ పథకాలపై ప్రజలు సైతం సంతోషంగా ఉన్నారన్న ఆయన దేశం మొత్తం చూస్తున్న ప్రత్యామ్నాయం కేసీఆర్‌ అని చెప్పారు. తెలంగాణా ప్రభుత్వ రాజముద్రలో కాకతీయ కళా తోరణం చిహ్నంగా ఉందంటే అది వరంగల్‌ జిల్లా మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోయేలా లెక్కలేనన్ని నిధులిస్తున్నారని, సజీవ జల దశ్యాన్ని కేవలం సంవత్సర కాలంలోనే ఓరుగల్లు వాసులకు చూపిస్తామని హామీ ఇచ్చారు. రైతు కుటుంబాలకు ధీమా నిచ్చి రైతు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. మన పధకాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌ వంటి నాయకులు తెలంగాణా పథకాలను కాపీ కొడుతున్నారన్నారు. ఈ ఎన్నికలు మోడీకి రాహుల్‌ గాంధీకి మధ్య జరిగే యుద్ధం కాదని దేశం కోసం పని చేసే ప్రాంతీయ పార్టీల నాయకులు చాలా మంది ఉన్నారన్నారు కేటీఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ చాలా రాష్ట్రాల్లో అడ్రెస్‌ లేకుండా పోయింది. అలాగే బీజేపీ సైతం ఉనికి కోల్పోయిందన్న కేటీఆర్‌ ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీల హవానడుస్తుంది అని చెప్పారు . పోలవరం ప్రాజెక్ట్‌ కు జాతీయ హోదా ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్‌, పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మోసం చేసిన కారణం గా అయినా కేంద్రానికి బుద్ధి చెప్పాలని ఆనారు. తెలంగాణా సత్తా చాటేలా 16 స్థానాల్లో విజయం సాధిస్తే కేంద్ర సర్కార్‌ ను నిర్ణయించే శక్తి తెలంగాణాకు వస్తుందని కేటీఆర్‌ అన్నారు. అప్పుడు నిధులు ఎలా రావో చూస్తామని అన్నారు కేటీఆర్‌. దేశంలో రానున్న ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుతం ఏర్పాటు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో కేసీఆర్‌ నాయకత్వం కీలకంగా మారనుందని చెప్పిన కేటీఆర్‌ కాంగ్రెస్‌ వాళ్ళ బతుకు మొత్తం ఢిల్లీ … ఢిల్లీ నుండి పర్మిషన్‌ ఇస్తేనే బాత్‌ రూమ్‌ కైనా వాళ్ళు పోయేది అని, రాహుల్‌ గాంధీ కూర్చోమంటే కూర్చునే, నిల్చోమంటే నిల్చునే వారికి ఓటేస్తే మోరిలో వేసినట్టేనని కేటీఆర్‌ తెలిపారు. ఇక పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ నేలవిడిచి సాము చెయ్యొద్దని, గ్రామ గ్రామానా అప్రమత్తంగా ఉండాలని, లోక్‌ సభ ఎన్నికల తరువాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని కాబట్టి క్షేత్ర స్థాయిలో బలంగా ప్రచారం.

కేసీఆర్‌కు ఇష్టమైన జిల్లా వరంగల్‌ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొ.జయశంకర్‌ సలహాలు..సూచనలతో కేసీఆర్‌ ముందుకెళ్లారని సభలో కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు, రాష్ట్రానికి ఏ నాటికైనా స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని జయశంకర్‌ తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. రాజీలేని పోరాటం చేసే నాయకుడు కేసీఆర్‌ అని.., ఢిల్లీలో రాజకీయ వ్యవస్థను శాసించి సాధించుకోవాలే కానీ యాచించి కాదన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకోవాలని చెప్పారని, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. 

ఈ సమావేశంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్‌ మాట్లాడుతూ... వరంగల్‌ లో రైల్వే వ్యాగన్‌ పరిశ్రమను విజయవాడకు తరలించనున్నారని, అందుకు తమరు కాజీపేట లోనే ఉండేవిధంగా కృషి చేయాలి అని కోరగా... ఆయన అందుకు స్పందిస్తూ... తప్పకుండా అని హావిూ ఇచ్చారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాం నాయక్‌ ,పసునూరి దయాకర్‌, బండ ప్రకాష్‌ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి , శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, ఆరూరి రమేష్‌, శంకర్‌ నాయక్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి , చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య చైర్మన్‌ లు మరి యాదవ రెడ్డి, వాసుదేవ రెడ్డి , రాజయ్య యాదవ్‌, గుండు సుధారాణి మేయర్‌ సిరాజుద్దీన్‌, జడ్పీ చైర్పర్సన్‌ గద్దల పద్మ, సత్యవతి రాథోడ్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బాత్రూంకు వెళ్ళాలన్నా రాహుల్‌ గాంధీ పర్మిషన్‌ కావాలి .. కేటీఆర్‌ సెటైర్లు

కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై కేసీఆర్‌ సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలకు సంబంధం లేదని చెప్తున్నారని, ఈ ఎన్నికలు మోడీ కి రాహుల్‌ గాంధీకి మధ్య జరిగే యుద్ధం అన్నట్టు చెప్పుకుంటున్నారు అన్న కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకు పోయిందని చెప్పారు. వరంగల్‌ ఓ సిటీలో జరిగిన లోక్‌ సభ ఎన్నికల సమాయత్త సభలో పాల్గొన్న కేటీఆర్‌ కాంగ్రెస్‌ నాయకులపై పంచ్‌ ల మీద పంచ్‌ లు వేశారు. మీసాలు, గడ్డలు పెంచుకోవటం తప్ప , తొడలు కొట్టుకోవటం తప్ప ఇంకేం చెయ్యలేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వాళ్ళ బతుకు మొత్తం ఢిల్లీ నే అన్న ఆయన ఏది చెయ్యాలన్నా ఢిల్లీ నుండి అనుమతి తీసుకోవాలని చివరకు ఢిల్లీ నుండి పర్మిషన్‌ ఇస్తేనే బాత్‌ రూమ్‌ కైనా వాళ్ళు పోయేది అని సెటైర్లు వేశారు . అలాంటి వాళ్ళు తెలంగాణా రాష్ట్రం కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. , రాహుల్‌ గాంధీ కూర్చోమంటే కూర్చునే, నిల్చోమంటే నిల్చునే వారికి ఓటేస్తే మోరిలో వేసినట్టేనని కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో మరోమారు కాంగ్రెస్‌ నాయకులను చావు దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here